పాకల బీచ్‌లకు పర్యాటకుల భద్రతకు మత్స్యకారులు భరోసాగా నిలుస్తున్నారు. గతంలో జరిగిన పలు ఘటనల్లో మత్స్యకారులు ఎంతోమంది పర్యాటకుల ప్రాణాలు కాపాడారు. పర్యాటకుల ప్రాణాలు కాపాడిన వారిలో ప్రధానంగా మత్స్యకారులు సైకం బ్రహ్మయ్య, గొల్లపోతు సుబ్రమ్మణ్యం, పిన్ని జాలయ్య ఉన్నారు. వీరు ఇప్పటి వరకు సుమారు 100కు పైగా పర్యాటకుల ప్రాణాలు కాపాడారు. తీరంలో పర్యవేక్షించే మైరెన్ పోలీసుల్లో 90 శాతం మందికి ఈత రాదంటే అతిశయోక్తి కాదు. ప్రతిసారి మత్స్యకారులు పర్యాటకులను కాపాడటం ఆ క్రెడిట్‌ను మైరెన్ పోలీసులు వేసుకోవటం పరిపాటిగా మారింది. ప్రజల ప్రాణాలు కాపాడలేని మైరెన్ పోలీసులు కనీసం వారికి భద్రత కల్పించేందుకై నా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.


