అక్రమ కేసులకు భయపడేది లేదు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులకు భయపడేది లేదు

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరేయడం ఖాయం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలి కార్యకర్తలకు అండగా ఉంటా దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ

దర్శి: ఎన్నికల్లో గెలవలేక పోలీసులను అడ్డు పెట్టుకుని అధికార పార్టీ నేతలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, అక్రమాలను ఎదిరించి ప్రతి చోట వైఎస్సార్‌ సీపీ పోటీ చేస్తుందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యురాలు జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ స్పష్టం చేశారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. 28 వార్డుల్లో పోటీకి ఉత్సాహం చూపుతున్న నాయకులు, కార్యకర్తలతో వార్డుల వారీగా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వార్డుల్లో స్థితిగతులు, రిజర్వేషన్‌ల వారీగా వార్డుల్లో పార్టీ బలాబలాలు, ఎవరు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. రిజర్వేషన్‌లు ఖరారైన తరువాత మళ్లీ అందరితో మరొకసారి మాట్లాడి మంచి వ్యక్తులను నిలబెట్టి గెలిపిద్దామని వారికి భరోసా ఇచ్చారు.

వైఎస్సార్‌ సీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి..

ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, నాయకుడు వైఎస్సార్‌ సీపీ విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అందరి సమష్టి కృషితో దర్శి నగర పంచాయతీలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులు పెట్టాలని చూస్తే మీకంటే ముందు తానే నిలబడతానన్నారు. పోటీ చేసే అందరినీ జైల్లో పెట్టాలంటే ఇక్కడ జైళ్లు సరిపోవని, మనందరం కలసికట్టుగా ధైర్యంగా ఎదుర్కొంటే ఆ పరిస్థితులు కూడా రావన్నారు.

జగనన్న సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్దాం..

గత ప్రభుత్వంలో ప్రజలకు జగనన్న అందించిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్దామని బూచేపల్లి అన్నారు. రెండున్నరేళ్లుగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జగనన్న ఇస్తున్న పథకాలు తీసేశారని, సంక్షేమం అభివృద్ధి అటకెక్కించారని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారని, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. మహిళలకు ఇస్తానన్న హామీలన్నీ ఎగ్గొట్టి వారిని మోసం చేశారని గుర్తు చేశారు. బీసీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకుండా వారిని దారుణంగా మోసం చేశారన్నారు. కూటమిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని స్పష్టం చేశారు. కనీసం తాగునీరు కూడా అందక నగర పంచాయతీలో ప్రజలు బిందెలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చే దుస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేక పోయినా ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని చూస్తున్నారన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుండి మీ అందరినీ గెలిపించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ వెన్నపూస వెంకటరెడ్డి, షేక్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ఎం బాషా, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయ్‌ భాస్కర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీరెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మాజీ వైస్‌ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మాజీ సర్పంచ్‌ చంద్రగిరి గురవారెడ్డి, మాజీ జెడ్పీటీసీ దామెర్లచంద్రం, కౌన్సిలర్లు మేడం మోహన్‌రెడ్డి, తుళ్లూరి బాబురావు, జగన్నాథం మోహన్‌బాబు, ఆవుల జ్యోతి శివారెడ్డి, పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, నాయకులు కర్ణా భాస్కర్‌రెడ్డి, కట్టెకోట హరీష్‌, అంకాల శ్రీను, అంకాల నాగయ్య, అన్నవరపు రవి, పాణెం మజ్ఞువలి, కొడవటి జాన్‌, గర్నెపూడి సామ్యేల్‌, పాశం సురేష్‌, గంజి వెంకటేశ్వరరెడ్డి, భవనం కొండారెడ్డి, వెంకటరెడ్డి, కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చిన్నా, ఏడుకొండలు, బ్రహ్మయ్య, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement