వైభవంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభం

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

యర్రగొండపాలెం: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన త్రిపురాంతకంలోని బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు మంత్రోచ్ఛరణలతో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారు బాలత్రిపురసుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వేదపండితులు నిర్వహించిన అమ్మవారి పల్లకిసేవ భక్తులకు కనులవిందు చేసింది. అమ్మవారి కరుణ కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి అమ్మవారిని పద్మవాహనంపై ఊరేగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement