మంత్రి స్వామికి చంద్రబాబు చురకలు | CM Chandrababu Fire On Minister Swami | Sakshi
Sakshi News home page

మంత్రి స్వామికి చంద్రబాబు చురకలు

Oct 12 2026 11:20 AM | Updated on Oct 12 2026 11:28 AM

CM Chandrababu Fire On Minister Swami

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జరుగుమల్లి మండలం నర్శింగోలు గ్రామంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో రైతులకు పాస్‌పుస్తకాల పంపిణీలో భాగంగా నిర్వహించిన మీ భూమి–మీ హక్కు గ్రామసభలో మంత్రి స్వామి పనితీరు బాగా లేదని, ఇంకా హుషారు అవ్వాలని సీఎం చురకలంటించడం ఆ నియోజకవర్గంతో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

అన్ని సేవల్లో రాష్ట్రంలోని జిల్లాల పనితీరు 70.10 శాతంగా ఉంటే.. ప్రకాశం జిల్లాలో 69.29 శాతం మాత్రమే ఉందని, కొండపి నియోజకవర్గంలో 68.91 శాతం మాత్రమే ఉందని, మంత్రి స్వామి పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం చురకలంటించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో జిల్లా 21వ స్థానంలో ఉండగా, కొండపి నియోజకవర్గం 122వ స్థానంలో ఉందని, ఇలా అయితే సహించేది లేదని, పనితీరు మెరుగుపరచుకోవాలని మంత్రిస్వామితో పాటు అధికారులకు చంద్రబాబు చురకలంటించడంపై ఆ పార్టీ నాయకులే ఎద్దేవా చేస్తున్నారు.

 ఆ తర్వాత జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా నియోజకవర్గంలో పార్టీ పనితీరు బాగాలేదని, ఆరు మండలాల అధ్యక్షుల పనితీరు, క్లస్టర్‌ ఇన్‌చార్జుల పనితీరు, బూత్‌ కమిటీ ఇన్‌చార్జుల పనితీరు బాగా లేదని, కేవలం 7 బూత్‌ కమిటీ ఇన్‌చార్జుల పనితీరు మాత్రమే బాగుందని చంద్రబాబు అన్నారని ఆ పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో ఓట్ల శాతం బాగా ఉందని, కానీ నాయకుల మధ్య సమన్వయం లేదని, దామచర్ల సత్య కూడా తగ్గించుకుని స్వామితో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధించాలని, అలాకాకుండా ఎన్నికల తర్వాత సాకులు చెప్పాలని ప్రయత్నిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చెప్పడాన్ని బట్టి చూస్తే.. నియోజకవర్గంలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని పలువురు టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement