మాతృ మరణాలు జరగకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

మాతృ మరణాలు జరగకుండా చూడాలి

Oct 9 2026 1:56 AM | Updated on Oct 9 2026 1:56 AM

● మార్కాపురం కలెక్టర్‌ విజయ సునీత

మార్కాపురం: మాతృ మరణాలు జరగకుండా చూడాలని కలెక్టర్‌ విజయ సునీత అధికారులను ఆదేశించారు. మార్కాపురం జిల్లాలో గత ఏప్రిల్‌ నుంచి జూలై నెల వరకు సంభవించిన మాతృ మరణాలపై ఆయా శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మాతృ మరణాలకు దారితీసిన పరిస్థితులు, కారణాలు, ఎదురైన సమస్యలు, వైద్య సేవల సమయంలో ఎదురైన ఆరోగ్యపరమైన సమస్యలు, ఆ సమయంలో తీసుకున్న చర్యలపై సమగ్రంగా చర్చించారు. మాతృ మరణాలకు సంబంధించిన వైద్యశాలలైన తిరుపతి స్విమ్స్‌, కర్నూలు అమిలియో హాస్పిటల్‌, మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యులు కూడా సమీక్షలో పాల్గొని ఆయా కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రతి మరణంపై కూలంకషంగా చర్చించారు. గర్భిణులకు అందిన వైద్య సేవలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న చర్యలు, ఆస్పత్రికి తరలించిన విధానం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు ప్రమాద పరిస్థితులను ముందుగానే గుర్తించి సకాలంలో అవసరమైన వైద్యం అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి గర్భిణుల ఆరోగ్యం పట్ల నిత్యం పర్యవేక్షణ ఉండేలా చూడాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ మనస్సే, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ సుజన, ఐసీడీఎస్‌ పీడీ పద్మావతి, డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణం, అనస్థీషియా వైద్యనిపుణులు డాక్టర్‌ గౌతమి, గైనకాలజిస్టు డాక్టర్‌ వసంత, 108 ప్రతినిధి వెంకటేష్‌, మాచవరం, నంద్యాల రోడ్‌, గిద్దలూరు, యాచారాం ప్రాంతాలకు చెందిన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement