28 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా | - | Sakshi
Sakshi News home page

28 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

Oct 9 2026 1:56 AM | Updated on Oct 9 2026 1:56 AM

28 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా మహిళలకు వృత్తి నైపుణ్యంలో ఉచిత శిక్షణ

సిండికేట్‌ అయినట్లు ఆరోపణలు

ఒంగోలు టౌన్‌: ప్రకాశం జిల్లాలో నోటిఫై చేసిన 45 దుకాణాలలో 28 మద్యం దుకాణాలకు గురువారం లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డీఆర్‌ఓ వెంకట రమణ చేతుల మీదుగా డ్రా తీసి లైసెన్స్‌లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్‌ హేమంత్‌ నాగరాజు పర్యవేక్షించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిహించిన డ్రాకు 143 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ షేక్‌ ఆయేషా బేగం తెలిపారు.

దరఖాస్తుదారులు సిండికేట్‌ అయినట్లు ఆరోపణలు...

డ్రాకు ముందే దరఖాస్తుదారులు సిండికేట్‌గా ఏర్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో టీడీపీ సానుభూతిపరులు, కీలక నేతలు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే డ్రాలో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఒక్కో షాపునకు 4 దరఖాస్తులు వస్తేనే డ్రా నిర్వహించాలన్న నిబంధన ఉంది. ఆ మేరకు 45 దుకాణాలకుగానూ ఒంగోలు సర్కిల్‌ పరిధిలో 56, చీమకుర్తి పరిధిలో 18, దర్శి పరిధిలో 23, సింగరాయకొండ పరిధిలో 4, అద్దంకి పరిధిలో 10, కందుకూరు పరిధిలో 32 కలిపి మొత్తం 143 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 28 దుకాణాలకు మాత్రమే నాలుగు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఒంగోలు 12, చీమకుర్తి 3, దర్శి 4, సింగరాయకొండ 1, అద్దంకి 2, కందుకూరు 6 దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించారు. ఇంకా 17 దుకాణాలకు డ్రా నిర్వహించాల్సి ఉంది. వీటిలో ఒంగోలులోని రెండు షాపులకు మూడు దరఖాస్తుల చొప్పున వచ్చాయి. చీమకుర్తిలోని ఒక షాపునకు మూడు దరఖాస్తులు వచ్చాయి. ఆయా షాపులకు ఈ నెల 10వ తేదీ డ్రా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 14 షాపులకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్‌ ఇచ్చి డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంతనూతలపాడు: మండల పరిధిలోని ఎండ్లూరు డొంక వద్ద ఉన్న జిల్లా స్థాయి మహిళా ప్రాంగణంలో మహిళలకు వివిధ వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మహిళా ప్రాంగణం మేనేజర్‌ కె.మాధవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధుల సంరక్షకుల శిక్షణ, పిల్లల సంరక్షకుల శిక్షణతో పాటు టైలరింగ్‌, బ్యూటీషియన్‌, కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనునున్నట్లు చెప్పారు. ఈ శిక్షణకు 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ మహిళలు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని మాధవి కోరారు. మరిన్ని వివరాలకు 6302733492, 9963005209, 9000850869 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement