అకాల కురిసిన వర్షానికి మొక్కజొన్న పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. పంటకు మంచి ధర పలుకుతుందన్న ఉద్ధేశంతో ఎకరాకు రూ.10వేలు కౌలు చెల్లించి 5 ఎకరాల్లో సాగు చేశాను. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో కంకులు కోతకు వస్తాయి. గింజ కూడా గట్టిపడి బరువు పెరుగుతుందనుకుంటున్న తరుణంలో వర్షం కురిసి పంట నేలవాలింది. దీంతో కంకులు తడవడంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. ముందస్తుగా పంటను కోయాల్సి వచ్చింది. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే తాము అప్పుల పాలవుతాం.
– వనిపెంట వీరమ్మ, యర్రగొండపాలెం
పంట నష్టాలను అంచనా వేస్తున్నాం
అకాల వర్షాలకు మొక్కజొన్న పంట రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మేరకు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాం. పుల్లలచెరువు మండలంలోని కొమరోలు, యడ్రపల్లి గ్రామాల ప్రాంతాల్లో మొక్కజొన్న రైతులకు దాదాపు రూ.10లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు నివేదించాం. మిగిలిన మండలాల్లో జరిగిన నష్టం గురించి ఆయా మండలాల ఏఓలు అంచనా వేస్తున్నారు.
– వెంకటరమణ, ఏడీఏ, యర్రగొండపాలెం


