మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం! | - | Sakshi
Sakshi News home page

మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం!

Mar 1 2026 7:39 AM | Updated on Mar 1 2026 7:39 AM

మహిమా

మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం!

అద్దంకి రూరల్‌:

కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు నమ్మకంతో మహిమాన్విత క్షేతంగా విరాజిల్లుతోంది శింగరకొండ. శింగరకొండ క్షేత్రం 14వ శతాబ్ధం నాటికే కొండపై లక్ష్మీ నరసింహాస్వామి దేవాలయం భక్తుల పూజలందుకుంటోంది. సుమారు 150 ఏళ్ల క్రితం లక్ష్మీనరసింహాస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధ్వజ స్తంభం ప్రతిష్ట జరుగుతుండగా భవనాశి తటాకం ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం తేజోవంతమై యోగీశ్వరుడు కొండ దిగువున ప్రసన్నాంజనేయస్వామి విగ్రహాన్ని పూజించి అదృశ్యమయ్యాడు. ఆ అద్భుతాన్ని కొండపై నుంచి చూసిన వేలాది మంది భక్తుల కొండ దిగి వచ్చి భక్తిశ్రద్ధలతో స్వామి వారిని పూజించి తరించారు. అప్పటి నుంచి శింగరకొండలో వెలసిన ప్రసన్నాంజనేయస్వామి వారి దేవస్థానం దివ్యక్షేత్రమై విరాజిల్లుతోంది.

దక్షిణాభిముఖం ఆలయం విశిష్టత

శ్రీరామ చంద్రుడి ఆజ్ఞ మేరకు సీతమ్మ తల్లిని వెతుకుతూ దక్షిణ పథంగా బయల్దేరిన ఆంజనేయుడు ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడని ఒక నమ్మకం. అందువల్లే ఈ క్షేత్రంలో ప్రసన్నాంజనేయుడు నెలవై ఉన్న దేవాలయం దక్షిణ ముఖంగా ఉంది. అన్ని దేవాలయాలు తూర్పు, ఉత్తర ముఖ ద్వారాలు కలిగి ఉండగా ఒక్క శింగరకొండ క్షేత్రం దక్షిణాభిముఖం కలిగి ఉండటం విశేషం. కొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, కొండ కింద ప్రసన్నాంజనేయుడి దేవాలయాలతో ఉభయ దేవతా క్షేత్రంగా పేరుపొందిన శింగరకొండ క్షేత్రం దర్శనం సర్వపాపాల నివారిణిగా భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి మంగళ, శనివారాల్లో విశేష పూజలు, ఉగాది, శ్రీరామనవమి, హనుమజ్జయంతి, ముక్కోటి, సంక్రాంతి, తిరునాళ్లకు భక్తులు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతారు. తమల పాకులు పూజలు, అరటి పండ్ల పూజ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నుంచి చదుర్ధశి వరకు గత నెల 28వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు 71వ వార్షిక తిరునాళ్ల జరుగుతుంది. 2వ తేదీన జరిగే ప్రధాన తిరునాళ్ల రాత్రికి భక్తులు ఏర్పాటు చేసే విద్యుత్‌ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తిరునాళ్లకు వచ్చే భక్తులకు అన్ని సామాజిక వర్గాలకు చెందిన సత్రాలు అన్నప్రసాదాన్ని అందజేస్తున్నాయి. వినోదానికి భారీ జెయింట్‌ వీల్‌, మ్యాజిక్‌ చైర్స్‌, పిల్లలకు రంగుల రాట్నాలు సిద్ధంగా ఉన్నాయి.

కొండపై లక్ష్మీనరసింహస్వామి,

కొండ కింద ప్రసన్నాంజనేయస్వామి

దక్షిణాభిముఖంగా వెలసిన

ప్రసన్నాంజనేయస్వామి ఆలయం

క్షేత్ర దర్శనం సర్వపాపాల నివారిణిగా భక్తుల నమ్మకం

71వ వార్షిక తిరునాళ్ల ప్రారంభం

తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి

ప్రత్యేక ఆకర్షణగా ప్రభలు

క్షేత్రాన్ని చేరుకునే మార్గం ఇలా..

ఒంగోలు నుంచి బస్సులో అద్దంకి చేరుకున్న తర్వాత అద్దంకి నుంచి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న శింగరకొండకు ప్రతి 30 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్‌ వైపు నుంచే భక్తులకు సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం జంక్షన్‌ నుంచి నామ్‌ హైవేపై నేరుగా రావచ్చు. తిరునాళ్ల ప్రత్యేక రోజుల్లో అద్దంకి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు.

మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం! 1
1/5

మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం!

మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం! 2
2/5

మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం!

మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం! 3
3/5

మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం!

మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం! 4
4/5

మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం!

మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం! 5
5/5

మహిమాన్వితం.. శింగరకొండ క్షేత్రం!

Advertisement
 
Advertisement
Advertisement