గ్రావెల్‌ అక్రమంగా తరలింపు | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ అక్రమంగా తరలింపు

Mar 1 2026 7:39 AM | Updated on Mar 1 2026 7:39 AM

గ్రావెల్‌ అక్రమంగా తరలింపు

గ్రావెల్‌ అక్రమంగా తరలింపు

గ్రావెల్‌ అక్రమంగా తరలింపు

గుడ్లూరు: మండలంలోని కొత్తపేట చెరువు నుంచి గ్రావెల్‌ను అధికార పార్టీ నాయకుల అండతో అక్రమార్కులు కొందరు బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి తవ్వకాలు జరపుతుండటంతో కొత్తపేట గ్రామస్తులు కొందరు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. వారు అక్కడ ఉన్నంత వరకు తవ్వకాలు నిలిపేసిన అక్రమార్కులు ఆ తర్వాత యథావిధిగా తవ్వకాలు ప్రారంభించారు. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్‌, పంచాయతీ అధికారులకు సమాచాం ఇచ్చినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విలువైన మట్టి, గ్రావెల్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా కొత్తపేట పంచాయతీలోని ఓ ప్రైవేటు వెంచర్‌కు తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకుల అండదండలతో యథేచ్ఛగా గ్రావెల్‌ తరలిస్తున్నారు. ఓ జేసీబీతో పాట్లు నాలుగు ట్రాక్టర్లు రాత్రి వేళల్లో మట్టి తరలించడంపై అధికారులు స్పందించి గ్రావెల్‌ తవ్వకాలు నిలిపేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement