వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించివేత | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించివేత

Mar 1 2026 7:39 AM | Updated on Mar 1 2026 7:39 AM

వైఎస్

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించివేత

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించివేత

మార్కాపురం రూరల్‌: తర్లుపాడు మండలంలోని కారుమానుపల్లి గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టీడీపీ కార్యకర్తలు శనివారం చించివేశారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ దొండపాటి ఇంద్రారెడ్డి ఇటీవల పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గ్రామానికి వచ్చినప్పుడు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దానిని అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త జీ శ్రీనివాసరెడ్డి, మరో వ్యక్తి కలిసి పూర్తిగా చించివేయడంతో ఫ్రేమ్‌ మాత్రమే మిగిలిందని ఇంద్రారెడ్డి తెలిపారు. తమ గ్రామానికే చెందిన వ్యక్తి తనను ఫోన్‌లో బెదిరిస్తూ మాట్లాడాడని, ఆ విషయాన్ని అన్నా రాంబాబుకు, పోలీసులకు తాను చెప్పానని, దాన్ని మనసులో పెట్టుకుని ఫ్లెక్సీ చించివేశారని ఇంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ వలన ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదని, ఉద్దేశపూర్వకంగా దాన్ని చించివేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించివేత 1
1/1

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ చించివేత

Advertisement
 
Advertisement
Advertisement