భవనం పైనుంచి పడి మహిళా కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

భవనం పైనుంచి పడి మహిళా కూలీ మృతి

Feb 28 2026 7:39 AM | Updated on Feb 28 2026 7:39 AM

భవనం పైనుంచి పడి మహిళా కూలీ మృతి

భవనం పైనుంచి పడి మహిళా కూలీ మృతి

భవనం పైనుంచి పడి మహిళా కూలీ మృతి

కనిగిరి రూరల్‌: నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తు నుంచి ఓ మహిళా కూలీ ప్రమాదవశాత్తు జారి పడటంతో తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఈ సంఘటన కనిగిరి పట్టణంలోని కేశిరెడ్డి నగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కనిగిరి అర్బన్‌ కాలనీకి చెందిన పందిటి రాధ(40), తన భర్త బ్రహ్మయ్యతో కలిసి కేశిరెడ్డి నగర్‌లో భవన నిర్మాణ పని చేస్తోంది. ఈ క్రమంలో రెండో అంతస్తులో పని చేస్తూ జారి కింద పడటంతో తల, మెడ భాగంలో బలమైన గాయాలయ్యాయి. కనిగిరిలోని ఓ ఆస్పత్రిలో ప్రథక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో పరిస్థితి విషమించడంతో కందుకూరులోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ రాధ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ విషయమై తమకు ఎటువంటి సమాచారం లేదని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement