60,000
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెల్లపశువులు
పశువైద్యశాలల్లో మందుల కొరత భర్తీకాని వైద్యుల పోస్టులు పశువులకు రోగం వస్తే మందులు బయట కొనాల్సిందే.. పాడి రైతులకు భారమైన పశుపోషణ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారమైన పశుపోషణ వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటి ముంగిటకే వైద్యసేవలు
చంద్రబాబు ప్రభుత్వం పశువైద్యాన్ని పక్కనపెట్టేసింది. వైద్యులు.. మందుల కొరతతో చికిత్స అందక మూగజీవాలు అవస్థలు పడుతున్నా.. కన్నబిడ్డల్లా చూసుకుంటున్న వాటికి వ్యాధులు సోకి విలవిల్లాడిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పశు వైద్యశాలల్లో సరైన వైద్యం అందక మూగజీవాల వేదన అరణ్యరోదనగా మారింది. ఫలితంగా పశుపోషణ భారంగా మారిందని వారు ఆందోళన చెందుతున్నారు. పల్లెల్లో పశు వైద్యం పడకేయడంతో పశుపోషణ భారంగా మారిందని వారు ఆందోళన చెందుతున్నారు.
పశువులకు ఇబ్బంది
కలగకుండా చూస్తున్నాం
జిల్లాలో పశువులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. మందుల కొరత లేదు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను ఉన్నంత వరకూ ఆయా వైద్యశాలలకు పంపుతున్నాం. మా సిబ్బంది కూడా అందుబాటులో ఉండి పశువులకు చికిత్స చేస్తూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సిబ్బంది కొరతపై ప్రభుత్వానికి నివేదిక పంపాం. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరాం.
– రాఘవయ్య, ఇన్‌చార్జి జాయింట్ డైరెక్టర్, మార్కాపురం
డాక్టర్లను నియమించి మందులు అందించాలి
రాష్ట్ర ప్రభుత్వం పశువైద్యశాలలకు డాక్టర్లను నియమించి వెంటనే మందులు సరఫరా చేయాలి. మందుల కొరత మూలంగా జీవాలకు అనారోగ్యం వచ్చి వైద్యశాలకు తీసుకెళ్తే మందులు లేవంటున్నారు. దీంతో బయట కొని వాటికి వైద్యం చేయించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెటర్నరీ మందులను త్వరగా వైద్యశాలలకు అందించాలి.
– జి.బాలనాగయ్య, గొర్రెలు, మేకల పెంపకందారుల జిల్లా నాయకుడు, మార్కాపురం
వైద్యంమూగబోయింది
మార్కాపురం:
ఉమ్మడి జిల్లాలో రైతులకు వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమే ప్రధాన ఆదాయ వనరు. డాక్టర్లు, మందుల కొరతతో ఇక్కడ పశు వైద్యం గాలిలో దీపంగా మారింది. పశుసంపద రక్షణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 160కిపైగా పశు వైద్యశాలలు ఉన్నాయి. వాటిలో త్రిపురాంతకం, యర్రగొండపాలెం, మార్కాపురం, కంభం, బేస్తవారిపేట, గిద్దలూరు, హనుమంతునిపాడు, కనిగిరి, సీఎస్‌పురం, పొదిలి, కొండపి, టంగుటూరు, త్రోవగుంట, నాగులుప్పలపాడు, చీమకుర్తి, దర్శి, కురిచేడు, మద్దిపాడు, కందుకూరు, అద్దంకిలో అసిస్టెంటు డైరెక్టర్ స్థాయి కలిగిన వైద్యశాలలు ఉన్నాయి. పశువులకు వ్యాధులు సోకితే సరైన వైద్యం అందే పరిస్థితులు లేవు. వైద్యం కోసం పశువులను వైద్యశాలకు తీసుకెళ్తే అక్కడ సమస్యలు వెక్కిరిస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
మందుల కొరతతో అవస్థలు...
జిల్లాలోని పలు వైద్యశాలల్లో దాదాపు 8నెలలుగా మందుల కొరత ఏర్పడింది. దీంతో డాక్టర్లు తమ వద్ద లేని మందులను బయట తెచ్చుకోవాలని చీటీపై రాసిస్తున్నారు. మందులు తెచ్చుకుంటే వైద్యం చేస్తామని డాక్టర్లు చెబుతుండడంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. ఆర్‌ఎస్‌కేలలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. జ్వరానికి సంబంధించిన పారాసిటమాల్, మెలనెక్స్, హార్టి జోన్, అరుగుదలకు సంబంధించిన బీ కాంప్లెక్స్, నొప్పులకు సంబంధించి పెయిన్ కిల్లర్స్, పొట్ట ఉబ్బరం వస్తే ఉపయోగించే టిమ్‌ఫోనిన్, యాంటీబయాటిక్స్, బ్లోబెండ్, వాతం వస్తే ఉపయోగించే పొడి మందు జెన్సీన్, చిర్రెట్, జింజర్, పొదుగువాపు వ్యాధి వస్తే ఉపయోగించే మూడు రకాల మందులతో పాటు యాంటీబయాటిక్స్, జీవాలకు దగ్గు వస్తే వాడే టైల్‌సిన్, చర్మవ్యాధులొస్తే ఉపయోగించే సల్ఫర్ బేస్డ్ పౌడర్ ఇలా అన్ని ప్రధాన మందులకు కొరత ఏర్పడింది. వీటితోపాటు లైఫ్ సేవింగ్ మందులైన డెక్సామెథాజోన్, బీటా మెథాజోన్, ఐసోఫ్లెడ్ తదితర మందులు లభించడంలేదు. డాక్టర్లు చీటీరాసిస్తే ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి జీవాలను కాపాడుకుంటున్నారు. దీంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
మెరుగైన వైద్యం...
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశుపోషణపై ప్రత్యేక దృష్టి సారించారు. మందుల కొరత లేకుండా చూశారు. వైద్యశాలలకు, రైతు సేవా కేంద్రాలకు మందులు సరఫరా చేశారు. మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. జిల్లాకు 16 సంచార అంబులెన్స్‌లు కేటాయించారు. 1962 నంబర్‌కు ఫోన్ చేస్తే ఇంటి ముంగిటే పశువులకు వైద్యం అందేది.
పశ్చిమాన డాక్టర్ల కొరత...
జిల్లాలో మొత్తం 11 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల, మొగుళ్లూరు, హనుమంతునిపాడు మండలంలోని ఎస్‌ఆర్ పురం, వేములపాడు, గురవాజీపేట, పీసీ పల్లి మండలంలోని పెద్ద అలవలపాడు, పామూరు మండలంలోని ఆర్‌సీ పల్లి, సీఎస్ పురం మండలంలోని అంబవరం, గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, బేస్తవారిపేట మండలంలోని సోమవారపేట పశువైద్యశాలలో రెగ్యులర్ డాక్టర్లు లేకపోవడంతో ఇన్‌చార్జి డాక్టర్లే దిక్కయ్యారు. చిన్నదోర్నాలలో ఉన్న ఒక డాక్టరును మార్కాపురంకు డిప్యుటేషన్ వేశారు. దీంతో పశువైద్యశాలల కొరత ఏర్పడింది. పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులు ఇబ్బందులు పడుతున్నారు.
60,000
60,000
60,000
60,000
60,000
60,000


