మాట తప్పిన చంద్రబాబు
ఒంగోలు టౌన్: అధికారంలోకి రాగానే అంగన్‌వాడీల వేతనాలు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా వేతనాలు పెంచకుండా మాట తప్పారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గెంటనపల్లి శ్రీనివాసులు విమర్శించారు. మూడు బడ్జెట్‌లలో అంగన్‌వాడీల వేతనాల గురించి ప్రస్తావించకపోవడం మహిళలను మోసగించడమేనని మండిపడ్డారు. అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని, ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండో రోజుకు చేరాయి. దీక్షల్లో మద్దిపాడు, కొండపి, ఉలవపాడు, కందుకూరు ప్రాజెక్టులకు సంబంధించి 20 మంది రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. సుమారు 100 మందికి పైగా సంఘీభావంగా హాజరయ్యారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, మే నెలంతా సెలవులు ఇవ్వాలని నినాదాలు చేశారు. అంగన్‌వాడీల నినాదాలతో దీక్షా శిబిరం వద్ద దద్దరిల్లింది. ఈ సందర్భంగా గెంటనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ...అంగన్‌వాడీలకు వేతనాలు పెంచమని అడుగుతుంటే పట్టించుకోని ప్రభుత్వం పనిభారం పెంచి ఒత్తిడికి గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీ స్కూళ్లను బలోపేతం చేయడానికి బదులుగా నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తుందని విమర్శించారు. అంగన్‌వాడీలకు నెలకు రూ.24,800 వేతనం, ఆయాలకు రూ.20,300 వేతనం ఇవ్వాలని గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని, అందుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం ఆయాలకు కేవలం రూ.7000 మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. ప్రీస్కూళ్లను బలోపేతం చేయడం ద్వారా బాల్యం నుంచే విద్యార్థుల్లో చదువులపై ఆసక్తి పెంచినట్లవుతుందని చెప్పారు. మేనెలలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంగన్‌వాడీలకు మాత్రం ఎందుకు సెలవులు ఇవ్వడం లేదని నిలదీశారు. అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వై.సత్యవతి మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం పట్ల పాలకులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం తగదని హితువుపలికారు. సుదీర్ఘకాలంగా అంగన్‌వాడీలు సేవలు అందిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం దుర్మార్గమన్నారు. నిరాహార దీక్షలు చేస్తేనే కానీ అంగన్‌వాడీల వేతనాలు పెంచరా అని ప్రశ్నించారు. అంగన్‌వాడీలను చిన్నచూపు చూడడం పాలకులకు మంచిది కాదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రిలే దీక్షల్లో అంగన్‌వాడీ యూనియన్ నాయకులు పోలమ్మ, ప్రసన్న, మధురవాణి, ఎం.సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
● చెప్పుతో కొట్టుకున్న టీడీపీ మాజీ మండల కన్వీనర్
● టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు వెల్లడి
● సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
దర్శి: ‘ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినా విలువ లేదు’ అని ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ మాజీ మండల కన్వీనర్ సోమేపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు.టీడీపీ ఎందుకు అధికారంలోకి వచ్చిందా అని పశ్చాత్తపం వ్యక్తం చేశాడు. చెప్పుతో కొట్టుకుని వీడియో విడుదల చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండేళ్లుగా టీడీపీలో నరకం అనుభవిస్తున్నానని వీడియోలో వాపోయాడు. 14 ఏళ్ల పాటు టీడీపీ మండల కన్వీనర్‌గా పనిచేసిన తాను 2024లో టీడీపీ ఎందుకు అధికారంలోకి వచ్చిందా అని బాధపడుతున్నానని పలుమార్లు చెప్పుతో కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు.
అంగన్‌వాడీల రిలే సమ్మెలో సీఐటీయూ నాయకుల ధ్వజం
మాట తప్పిన చంద్రబాబు


