సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

Feb 27 2026 4:11 AM | Updated on Feb 27 2026 4:11 AM

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

కనిగిరిరూరల్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నాయబ్‌ రసూల్‌ ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే నాయబ్‌ రసూల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారన్నారు. కరువు భత్యం ఇవ్వాలని, ఉద్యోగ విరమణ అనంతరం రావాల్సిన సౌలభ్యాలు, సరెండర్‌లీవ్‌లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా నాయకులు పొట్టేండ్ల మాలకొండయ్య మాట్లాడుతూ 11వ పీఆర్సీ బకాయి చెల్లించాలని, 12వ పీఆర్సీ ఇవ్వాలని, 117వ జీవోను రద్దు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, పాత పెన్షన్‌ విధానంను వర్తింప చేయాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వివిధ డిమాండ్‌లో కూడిన వినతిపత్రాన్ని ఆర్‌ఐకు అందచేశారు. ధర్నాకు ఎన్జీఓ నాయకుడు పిల్లి వెంకట రమణారెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఆరు మండలాల ఏపీటీఎఫ్‌ నాయకులు కుడారి రామ్మోహన్‌రావు, ఎస్‌కే హుస్సేన్‌, ఏ హజతర్‌రెడ్డి, డి.పున్నమ్మ, సీహెచ్‌ సునితాదేవి, డి.మహేశ్వరి, నిర్మలా, మీనా, అరుణా, దానమ్మ, భవానీ, సయ్యద్‌ సల్మా, కె.సుభాషిణి, తోటా శ్రీనివాసులు, ఎస్‌కే ఖాజా మస్తాన్‌, మచ్చా ప్రసాద్‌, ఎన్‌ రమేష్‌ బాబు, జి.ప్రభాకర్‌, బీవీ ప్రసాద్‌, పెన్నా వెంకటేశ్వర్లు, హేమంత్‌కుమార్‌, డి.సుబ్బరాయుడు, జి.వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉపాధ్యాయులు జి.మల్లికార్జునరాజు, బి శివ ప్రసాద్‌చారి, సాల్మన్‌, సీహెచ్‌ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

నాయబ్‌ రసూల్‌ ధ్వజం

Advertisement
 
Advertisement
Advertisement