పథకాలు అమలు చేయలేకనే డైవర్షన్ పాలిటిక్స్
● సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కదిరి ధ్వజం
సీఎస్‌పురం(పామూరు): కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయలేక సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కనిగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కదిరి బాబూరావు ధ్వజమెత్తారు. బుధవారం సీఎస్‌పురం మండలంలోని శీలంవారిపల్లెలో ఆయన కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన నాయకులు శ్రీనీకు రూ.18 వేలు, నీకు రూ.15 వేలుశ్రీ అంటూ మహిళలను నమ్మించారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజల్లో తిరిగే ధైర్యం లేక ముఖం చాటేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా అన్ని విధాలుగా మోసం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తరాలు ఇవ్వడంతోపాటు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు ఇంటివద్దకే వచ్చాయని, ఇప్పుడు ఒక్క పెన్షన్ తప్ప ఏ పథకం రావడం లేదన్నారు. గడిచిన రెండేళ్లలో టీపీడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి 24 గంటలు మంద్యం అందుబాటులో ఉంచడం, మద్యం డోర్ డెలివరీ తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో పథకాలు అందక పేదలు అలమటిస్తున్నారని, జగన్ లాంటి వ్యక్తిని గెలిపించుకోలేకపోయామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ముంటే అధికారం చేపట్టిన తరువాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితా ప్రచురించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి పేద విద్యార్థులను డాక్టర్లను చేయాలని చూస్తే వాటిని ప్రైవేట్ పరంచేసి లబ్ధిపొందాలని చూసిన దుర్మార్గుడు చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డును కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమావేశంలో ఇరగని చలపతిరావు, మాజీ ఎంపీటీసీలు మునగల నారాయణరెడ్డి, మారం కాశిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్.బుజ్జి, మస్తాన్‌రెడ్డి, నున్నా నారాయణ పలువురు పాల్గొన్నారు.


