ప్రకాశం జిల్లా ఉద్యోగుల జేఏసీ ఎన్నిక ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లా ఉద్యోగుల జేఏసీ ఎన్నిక ఏకగ్రీవం

Feb 26 2026 9:13 AM | Updated on Feb 26 2026 9:13 AM

ప్రకాశం జిల్లా ఉద్యోగుల జేఏసీ ఎన్నిక ఏకగ్రీవం

ప్రకాశం జిల్లా ఉద్యోగుల జేఏసీ ఎన్నిక ఏకగ్రీవం

ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్‌గా కె.శరత్‌బాబు, సెక్రటరీ షేక్‌ అబ్దుల్‌ హై ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఒంగోలు నగరంలోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఏపీ జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ నూతన చైర్మన్‌ శరత్‌బాబు మాట్లాడుతూ.. త్వరలోనే జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాల్లో జేఏసీ కమిటీల నిర్మాణం చేపడతామని రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు పోరాట షెడ్యూల్‌ ప్రకటిస్తామని తెలియజేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జేఏసీ కమిటీని ఆహ్వానించి ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై చర్చించాలని 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ సెక్రెటరీ జనరల్‌ షేక్‌ అబ్దుల్‌ హై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఐఆర్‌ 29 శాతం ప్రకటించాలని, ఉద్యోగుల బకాయిలకు సంబంధించి రూట్‌ మ్యాప్‌ ప్రకటించాలన్నారు. హెల్త్‌ కార్డు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు తక్షణమే అందజేయాలని, సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా జేఏసీ కో చైర్మన్లుగా ఆర్‌.అంజయ్య, ఆర్టీసీ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ ఎం.లక్ష్మీనారాయణ, ఏపీటీఎఫ్‌ 1938 ఆర్‌సీహెచ్‌ కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్లుగా బి.శేషారావు, టి.శ్రీనివాసరావు(ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌), ఎన్‌వీ కృష్ణ(ఏపీ ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌) జి.ఈశ్వర్‌రెడ్డి(ఏపీ పీఆర్‌ డిప్లొమా ఇంజినీర్‌ అసోసియేషన్‌), ఎం.కోటేశ్వరరావు(ఏపీ వెటర్నరీ ఎంప్లాయీస్‌ జేఏసీ), జాయింట్‌ సెక్రెటరీలుగా ఎన్‌.ఉదయలక్ష్మి(ఏపీ గవర్నమెంట్‌ నర్స్‌ అసోసియేషన్‌), ఎస్‌కే మోమిన్‌(పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయ్‌ అసోసియేషన్‌), కె.శ్రీనివాసరావు(పే అండ్‌ అకౌంట్స్‌ ఎంప్లాయ్‌ అసోసియేషన్‌), జి.శివశంకర్‌(ఎస్టీయూ), మహావిష్ణు(స్వర్ణ వార్డ్‌ స్వర్ణ గ్రామ ఎంప్లాయ్‌ అసోసియేషన్‌), కె.రామయ్య(ఏపీ అగ్రికల్చరల్‌ మినిస్టర్‌ అసోసియేషన్‌), బి.అంకిరెడ్డి(ఏపీ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌), ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా కృష్ణకిషోర్‌, ఏపీ ఎన్జీవో ట్రెజరర్‌గా కె.శివకుమార్‌, ఏపీఎన్జీఓ ఈసీ మెంబర్లుగా పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

చైర్మన్‌గా శరత్‌బాబు, సెక్రటరీగా అబ్దుల్‌ హై

12వ పీఆర్సీ కమిషన్‌ వేయడంతోపాటు 29 శాతం ఐఆర్‌ ఇవ్వాలని డిమాండ్‌

ఉద్యోగులకు బకాయిల చెల్లింపుపై రూట్‌ మ్యాప్‌ ప్రకటించాలని విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement