ఇంగ్లిష్‌ పరీక్షకు 1536 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ పరీక్షకు 1536 మంది గైర్హాజరు

Feb 26 2026 9:11 AM | Updated on Feb 26 2026 9:11 AM

ఇంగ్ల

ఇంగ్లిష్‌ పరీక్షకు 1536 మంది గైర్హాజరు

ఇంగ్లిష్‌ పరీక్షకు 1536 మంది గైర్హాజరు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయానికి రూ.300 కోట్లు కేటాయించాలి కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్‌రెడ్డి బదిలీ ఐసీడీఎస్‌ పీడీగా నాగమణి బాధ్యతల స్వీకరణ హోరాహోరీగా ఎడ్ల పోటీలు

ఒంగోలు సిటీ: ఇంటర్‌ మొదటి సంవత్సరం ఇంగ్లిష్‌ పరీక్షకు 1536 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆర్‌ఐఓ ఆంజనేయులు తెలిపారు. జనరల్‌ విద్యార్థులు 21,531 మందికి గాను 20,286 మంది హాజరు కాగా 1245 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే ఓకేషనల్‌ విద్యార్థులు 2270 మందికి గాను 1979 మంది హాజరు కాగా 291 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 67 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. ఆర్‌ఐఓ 5 సెంటర్లు, డీఈసీ 6 సెంటర్లు, స్క్వాడ్‌ 32 సెంటర్లను తనిఖీ చేశాయని పేర్కొన్నారు.

సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్‌): పేర్నమిట్టలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ నిర్మాణానికి రూ.300 కోట్ల నిధులు కేటాయిచాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సీపీఎం నాయకుల బృందం విశ్వవిద్యాలయానికి కేటాయించిన 110 ఎకరాల స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పేరు మార్చారే గానీ భవన నిర్మాణాలు చేయడం మరిచిపోయారన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.104 కోట్లు మాత్రమే నిధులు కేటాయించారని, ఆ నిధులు ఉద్యోగులకు జీతాలకే సరిపోతాయన్నారు. విశ్వవిద్యాలయం చుట్టుపక్కల కొంత భూమి ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. ఇప్పటికై నా భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి తరగతులు ఇక్కడే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు శ్రీనివాసరావు సుబ్బారావు, వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, కాలేషా, రామకృష్ణ కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

కనిగిరిరూరల్‌: కనిగిరి ఆర్డీఓ బి.కేశవర్ధన్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు బదిలీ ఉత్తరు్‌ువ్ల రావడంతో బుధవారం సాయంత్రం ఆయన రిలీవ్‌ అయ్యారు. కనిగిరి ఇన్‌చార్జి ఆర్డీఓగా కంభం ఆర్‌అండ్‌ఆర్‌ యూనిట్‌ డిప్యూటీ కలెక్టర్‌(ఎల్‌ఏ) శివరామిరెడ్డిని నియమించినట్లు తెలిసింది.

ఒంగోలు సిటీ: ఐసీడీఎస్‌ పీడీగా ఎం. నాగమణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం పీడీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. అంగన్‌వాడీ పరిధిలోని చిన్నారులందరికీ మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందజేయాలన్నారు.

అర్ధవీడు: మండలంలోని బొమ్మిలింగం గ్రామంలో కోదండరామస్వామి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల స్థాయిలో బుధవారం ఎడ్ల బల ప్రదర్శన పోటీలు మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో మొత్తం 11 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పోటీల్లో నంధ్యాల జిల్లా సంబవరం గ్రామానికి చెందిన జూపల్లి ప్రభాకర్‌రెడ్డికి చెందిన రెండు జతల ఎడ్లు 4250 అడుగులు లాగి ప్రథమ, ద్వితీయ బహుమతులను కై వసం చేసుకున్నాయి. కురిచేడు మండలం పొట్లపాడుకు చెందిన మేడగం హర్షవర్ధన్‌ఎడ్డి ఎడ్ల జత 4250 అడుగులు లాగి మూడవ బహుమతిని, జె.పంగులూరుకు చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జడ 4118 అడుగులు నాల్గవ బహుమతిని, గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన పమిడి అంజయ్య ఎడ్ల జత 4072 అడుగులు లాగి ఐదవ స్థానం, బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన దేవరపల్లి జాన్వికారెడ్డి, ఆన్వికారెడ్డి ఎడ్ల జత 4040 అడుగులు లాగి ఆరోస్థానంలో నిలిచాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు ఆలయ కమిటీ సభ్యులు బహుమతులు ప్రదానం చేశారు.

ఇంగ్లిష్‌ పరీక్షకు 1536 మంది గైర్హాజరు 1
1/1

ఇంగ్లిష్‌ పరీక్షకు 1536 మంది గైర్హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement