
మోసానికి కేరాఫ్ అడ్రస్
కూటమి ప్రభుత్వం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
తాళ్లూరు: మోసానికి కేరాఫ్ అడ్రస్‌గా కూటమి ప్రభుత్వం మారిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను వంద శాతం నెరవేర్చిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. తాళ్లూరు మండల కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించి బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమానికి పార్టీ మండల అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. అనంతరం మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలను గాలికి వదిలేసిందని, ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కూటమి పార్టీల నాయకులు సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం పేరుతో గ్రామాల్లో పర్యటిస్తుంటే.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని హామీలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసినవేనని తెలిపారు. కరోనా విపత్తు సమయంలో కూడా ఇచ్చిన అన్ని హామీలను ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలు, పార్టీలకు అతీతంగా అమలు చేశారని వివరించారు. కానీ, కూటమి ప్రభుత్వంలో అమరావతి కోసం లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొచ్చిన డబ్బులు ఏం చేశారో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. మోదీ మెప్పు కోసం రూ.300 కోట్ల ప్రజాధనాన్ని యోగాంధ్ర పేరుతో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ దుర్వినియోగం చేశారని బూచేపల్లి ఆరోపించారు. రూ.300 కోట్లు పెట్టి వైజాగ్‌లో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఉపయోగించుకోవడం వారికి చేతకావడంలేదని విమర్శించారు.
మహిళలకు మాయమాటలు...
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు 2014 ఎన్నికల్లోనూ పొత్తుతో వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారని గుర్తుచేశారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారీ గెలుపు చూసి భయంతో 2024లోనూ మళ్లీ కూటమి కట్టి ఈవీఎంల ట్యాపరింగ్‌లు చేసి గెలిచారని, ఇప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ప్రతి మహిళకు రూ.18,000, మూడు గ్యాస్ సిలిండర్లు వంటి హామీలేవీ నెరవేర్చకుండా మాయమాటలు చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు.
నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటాం...
కూటమి నాయకులు పెడుతున్న అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ శ్రేణులు భయపడవద్దని, ప్రతి వైఎస్సార్ సీపీ నాయకుడు, కార్యకర్తకు తాము అండగా ఉంటామని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ హామీ ఇచ్చారు. 2029లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, అప్పటి వరకు ప్రతిఒక్కరూ ధైర్యంగా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తూము సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్‌రెడ్డి, ఐవీ సుబ్బారెడ్డి, జిల్లా సర్పంచ్‌ల సంఘ ఉపాధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఆదాం షరీఫ్, మండల ఉపాధ్యక్షుడు పులి ప్రసాద్‌రెడ్డి, ఆలోకం హరిబాబు, అనుబంధ విభాగాల అధ్యక్షులు కొర్రపాటి విష్ణు, కై పు అశోక్‌రెడ్డి, గువ్వల శ్రీనివాసరెడ్డి, గోవిందరాజు, మాయర్తి ప్రభుదాస్, నాగళ్ల గోపి, నాగళ్ల వెంకట్రావు, లతీఫ్, రమణారెడ్డి, సర్పంచ్‌లు మందా శాంసన్, షేక్ వలి, మంచాల వెంకటేశ్వరరెడ్డి, చిమట సుబ్బారావు, బొడ్డు రాములు, ఎంపీటీసీలు యోహాన్, పుల్లమ్మ, కోటయ్య, మాజీ జెడ్పీటీసీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మండల నాయకులు యత్తపు మధుసూదన్‌రెడ్డి, కటకంశెట్టి శ్రీను, దేవదానం, గోపాల్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జయరామిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సభ్యులు, నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మోసానికి కేరాఫ్ అడ్రస్