
చదువు ఒంటరైంది..
ప్రాథమిక విద్య విద్యార్థులకు కీలకమైన దశ. చదువులో బలమైన పునాది పడితేనే జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు. విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ విద్యను నీరుగార్చి ప్రైవేటు విద్యా రంగానికి ప్రయోజనం కలిగేలా చర్యలు
తీసుకుంటోందన్న విమర్శలున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపించడంలేదు. జిల్లాలోని 545 పాఠశాలల్లో
ఏకోపాధ్యాయులు సేవలందిస్తుండడం ఇందుకు నిదర్శనంగా ఉంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 మంది విద్యార్థులు దాటితే ఒక హెడ్ మాస్టర్‌తో సహా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లాలో అనేక పాఠశాలల్లో 20 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్క ఉపాధ్యాయుడితోనే బడిని నెట్టుకొస్తున్నారంటే పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. యర్రగొండపాలెంలోని తమ్మడపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 125 మంది విద్యార్థులుండగా ఒకే ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. ఇంత మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఎలా చదువు చెప్పగలడో పాలకులకే ఎరుక. సింగరాయకొండ మండలంలోని బింగినపల్లి ప్రాథమిక పాఠశాలలో 21 మంది విద్యార్థులు చదువుకుంటున్నా ఇక్కడ ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. బేస్తవారిపేట, అర్థవీడు, కొమరోలు మండలాల్లో 13 పాఠశాలల్లో 20 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటున్నా ఒక్క ఉపాధ్యాయుడిని నియమించడం గమనార్హం.
20 మంది దాటినా ఒక్కరే..

చదువు ఒంటరైంది..

చదువు ఒంటరైంది..

చదువు ఒంటరైంది..