
అధికార పార్టీ నాయకులే అధికారులా..?
● పేర్నమిట్టలోని రేషన్ షాపుపై తహసీల్దార్‌కు స్థానికుల ఫిర్యాదు
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): రేషన్‌షాపు నిర్వహణ సక్రమంగా లేదంటూ సంతనూతలపాడు తహసీల్దార్‌కు పేర్నమిట్ట వాసులు సోమవారం ఫిర్యాదు చేశారు. బత్తుల శ్రీను, మట్టిగుంట చిరంజీవి, తదితరులు పేర్నమిట్ట గ్రామంలోని 28వ నంబర్ రేషన్ దుకాణంపై ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం నవంబర్‌లో 6ఏ కేసు నమోదు చేయగా, అప్పటి నుంచి వీఆర్‌ఓ లాగిన్ ద్వారా రేషన్ ఇస్తున్నారని, కానీ, సోమవారం వీఆర్‌ఓ రాకుండా ఆ షాపులో అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సరుకు దింపుతున్నారని తెలిపారు. స్థానికులు అడ్డగించి తగిన చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీ నాయకులే అధికారులా..?