
బహుమతి పొందిన చిత్రం, ఎం.ప్రసాద్ (ఇన్‌సెట్‌లో)
ఒంగోలు మెట్రో: ప్రపంచ టూరిజం దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ సహకారంతో నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ఒంగోలుకి చెందిన ‘సాక్షి’ సీనియర్ ఫొటోగ్రాఫర్ ఎం.ప్రసాద్ తీసిన చిత్రానికి గోల్డ్‌మెడల్, ప్రతిభా పురస్కారం లభించింది.
కొత్తపట్నం సముద్ర తీరంలో సూర్యోదయ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే చిత్రం ఈ అవార్డుకు ఎంపికై నట్టు నిర్వాహకులు మెయిల్ ద్వారా తెలిపారు. ఈనెల 27న విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో పురస్కారం అందిస్తారు.