రాజమహేంద్రవరం: టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. బుచ్చయ్య చౌదరి మతి గతి తప్పి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చయ్యకు వయసు అయిపోయి ఏదో మాట్లాడుతున్నారన్నారు. బుచ్చయ్య ఇప్పుడు కేబినెట్‌లో ప్లేస్‌కోసం అర్రులు చాస్తున్నారని మండిపడ్డారు. హింసా రాజకీయాలు అంటూ వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలకు వేణుగోపాల్ కృష్ణ కౌంటరిచ్చారు. ఎవరివి హింసా రాజకీయాలు అందరికీ తెలుసని చురకలంటించారు.
చంద్రబాబు వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందడమే రాధాకృష్ణ లక్ష్యమని, రాధాకృష్ణ బ్రోకర్‌గా మారిపోయారని ప్రజలు అనుకుంటున్నారన్నారు. జర్నలిజం విలువ కోల్పోయేటట్లుగా రాధాకృష్ణ రాతలు ఉన్నాయన్నారు. ఏపీ ప్రజలకు రాధాకృష్ణతోనే హాని ఉందన్నారు మాజీ మంత్రి వేణు.
మీ పాత కథలు ఒక్కసారి గుర్తుచేసుకోండి
బుచ్చయ్య చౌదరికి వయసు పెరిగే కొద్దీ మతిస్థిమితం లేకుండా పోతుందన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా., ఆయన భాషా చాలా దారుణంగా ఉందని, మానసిక వైద్యులకు చూపించుకుంటే మంచిదని సూచించారు. హత్యా రాజకీయాలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని, గడిచిన రెండేళ్లలో ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ఘోరం జరుగుతూనే ఉందన్నారు. ఇసుక సరఫరాకు ఎక్కడకక్కడ కౌంటర్లు ఓపెన్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని, బుచ్చయ్య చౌదరి పాత కథలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిదన్నారు జక్కంపూడి రాజా.


