ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి: పుత్తా శివశంకర్ | Ysrcp Leader Putha Siva Sankar Comments On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి: పుత్తా శివశంకర్

Mar 7 2025 2:44 PM | Updated on Mar 7 2025 3:03 PM

Ysrcp Leader Putha Siva Sankar Comments On Chandrababu And Pawan Kalyan

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నోటికొచ్చినట్టు అబద్దాలు చెప్పారని.. రూ.14 లక్షల కోట్ల అప్పులంటూ.. రాష్ట్రం శ్రీలంక అయిందంటూ విష ప్రచారం చేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు.

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నోటికొచ్చినట్టు అబద్దాలు చెప్పారని.. రూ.14 లక్షల కోట్ల అప్పులంటూ.. రాష్ట్రం శ్రీలంక అయిందంటూ విష ప్రచారం చేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లోమీడియాలో అడ్డమైన కూతలు కూశారని.. దారుణమైన రాతలు రాశారని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో అప్పుల గురించి తప్పించి మాట్లాడించారు.’’ అని పేర్కొన్నారు.

‘‘ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆమోదంతో రాతపూర్వకంగా సమాధానం చెప్పక తప్పలేదు. నవ రత్నాల అమలు, డీబీడీ ద్వారా వేసిన నిధులు అన్నీ కలిపిన అప్పులు అవి. మరి చంద్రబాబు బ్యాచ్, ఎల్లోమీడియా ఎందుకు తప్పుడు కూతలు కూశారు?. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులు భారీగా ఉన్నాయి. ఆ లెక్కలు జనానికి తెలియకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కారు కూతలు కూసిన చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని శివశంకర్‌ డిమాండ్‌ చేశారు.

‘‘ఓట్ల కోసం తప్పుడు సమాచారం చెప్పామని జనం ఎదుట ఒప్పుకోవాలి. ఇక సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడానికి వీల్లేదు. వైఎస్‌ జగన్ చాలా చక్కగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కాపాడారని తేలింది. ప్రజలకు వాస్తవాలన్నీ తెలిశాయి’’ అని శివశంకర్‌ తెలిపారు.

ఏపీ బడ్జెట్‌పై పుత్తా శివ శంకీర్ షాకింగ్ నిజాలు..

 

Advertisement
 
Advertisement
Advertisement