చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం నాశనం: వైఎస్‌ జగన్‌ | Ysrcp Chief Ys Jaganmohan Reddy Slams Chandrababu On Polavaram Delay | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం నాశనం: వైఎస్‌ జగన్‌

Nov 20 2024 7:40 PM | Updated on Nov 20 2024 8:09 PM

Ysrcp Chief Ys Jaganmohan Reddy Slams Chandrababu On Polavaram Delay

సాక్షి,తాడేపల్లి: అసలు పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(నవంబర్‌20) నిర్వహించిన మీడియా సమావేశంలో పోలవరం జాప్యం వెనుక అసలు విషయాలను వైఎస్‌ జగన్‌ వివరించారు. 

‘ఇది నేను చెబుతోంది కాదు. కేంద్ర ప్రభుత్వం, నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు తప్పిదం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగాయన్నది స్పష్టంగా చెప్పింది. పోలవరం వద్ద గోదావరి నది దాదాపు 2.5 కిలోమీటర్ల వెడెల్పు ఉంటుంది. ఆ నీరు మళ్లిస్తేనే కద ప్రాజెక్టు కట్టగలిగేది. అందుకోసం ఏం చేయాలి? స్పిల్‌వే పనులు పూర్తి చేయాలి.

కానీ అవి పూర్తి చేయలేదు. అవి పూర్తి కాకుండానే కాఫర్‌డ్యామ్‌ పనులు మొదలుపెట్టావు. అసలు కాఫర్‌ డ్యామ్‌ అంటే ఏమిటంటే.. దాని ద్వారా నీరు ఆపుతారు. ఆ తర్వాత మెయిన్‌ డ్యామ్‌ పనులు చేయాలి. నదికి అటు,ఇటు రెండు కాఫర్‌డ్యామ్‌ల పనులు మొదలుపెట్టాడు. అంటే ఒకవైపు స్పిల్‌వే పూర్తి చేయలేదు.

మరోవైపు మెయిన్‌డ్యామ్‌కు ఫౌండేషన్‌ వేశారు. ఎందుకంటే అవన్నీ ఎర్త్‌వర్క్‌లు..కమీషన్లు వస్తాయి. సిమెంటు పనులైతే కమిషన్లు రావు. ఈలోగా సీజన్‌ వచ్చింది. కాఫర్‌డ్యామ్‌లు పూర్తి చేయలేదు. దాంతో నీరు పోవడానికి కాఫర్‌డ్యామ్‌పై రెండు గ్యాప్‌లు వదిలారు. అప్పుడేం జరిగింది. రెండున్నర కిలోమీటర్ల వెడల్పు ఉన్న నది, ఇక్కడికి రాగానే 400 మీటర్ల మేర తగ్గింది.

ఆ ఉధృతికి ప్రాజెక్టు ఫౌండేషన్‌ అయిన డయాఫ్రమ్‌వాల్‌ పూర్తిగా దెబ్బతిన్నది. చంద్రబాబు హయాంలోనే 2018–19లోనే భారీ వరదలకు అన్నీ దెబ్బతిన్నాయి. అందుకే మేం రాగానే స్పిల్‌వే పూర్తి చేశాం. దాంతో నీరు క్లియర్‌గా వెళుతున్నాయి. కాఫర్‌డ్యామ్‌ మరమ్మతులు మేమే చేశాం. ఇక డయాఫ్రమ్‌వాల్‌ను ఏం చేయాలి? మళ్లీ కట్టాలా? వద్దా అనేది నిపుణులు తేల్చాలి.

చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరం పనులు నాశనమయ్యాయి. అయినా అదే పనిగా దుష్ప్రచారం. ఆయన అనుకూల మీడియా వత్తాసు పలుకుతోంది’అని  పోలవరంపై చంద్రబాబు మోసాలను వైఎస్‌జగన్‌ ఏకరువు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement