టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ ట్వీట్ | YS Jagan Tweet On TDP Attacks In AP | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ ట్వీట్

Jun 6 2024 1:43 PM | Updated on Jun 6 2024 3:10 PM

YS Jagan Tweet On TDP Attacks In AP

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి’’ అని వైఎస్‌ జగన్‌ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.

గౌరవ గవర్నర్‌ గారు @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

 

సంబంధిత వార్త: టీడీపీ, జనసేన విధ్వంసం.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement