కేంద్రంలో కూటమిదే విజయం: జార్ఖండ్‌ సీఎం | We Are Forming the Government JMM | Sakshi
Sakshi News home page

కేంద్రంలో కూటమిదే విజయం: జార్ఖండ్‌ సీఎం

Published Mon, Jun 3 2024 11:36 AM | Last Updated on Mon, Jun 3 2024 11:36 AM

We Are Forming the Government JMM

2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరగనుంది. దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అయితే దీనికి ముందే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం దేశంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం లేదు. అయితే ఎగ్జిట్ పోల్ కరెక్ట్ కాదని ఇండీయా కూటమి నేతలు అంటున్నారు. తాము 295 సీట్లు గెలుచుకుని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వారు చెబుతున్నారు.

జార్ఖండ్ ముక్తి మోర్చా  ఇండయా కూటమిలో భాగం. రాష్ట్రంలో ఇండియా కూటమి 10కి పైగా సీట్లను గెలుచుకుంటుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ అన్నారు. ఇతర రాష్ట్రాల సీట్లతో కలిపి తాము మొత్తం 295 సీట్లు గెలుస్తామన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ చెబుతున్నదానిలో వాస్తవం లేదు. జార్ఖండ్‌లో కూటమి పరిస్థితి బాగానే ఉందన్నారు. కాగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియా కూటమి లోక్‌సభలో 295 సీట్లు గెలవడం ఖాయమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement