బెజవాడలోనూ బాబుకు పరాభవం

Vellampalli Srinivas Fires On Chandrababu Naidu - Sakshi

విజయవాడ పీఠం వైఎస్సార్‌సీపీదే

40 నుంచి వంద శాతానికి పన్ను పెంచిన ఘనుడివి

చంద్రబాబుపై మంత్రి వెలంపల్లి ధ్వజం

సాక్షి, అమరావతి: ప్రజా మద్దతుతో విజయవాడ నగర పీఠాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకోబోతోందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. కుప్పం తరహాలోనే విజయవా డలోనూ చంద్రబాబుకు పరాభవం తప్పదన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు విజయవాడ పర్యటన వల్ల ఆ పార్టీకి ఒరిగేదేమీలేదన్నారు. ఆయన చుట్టూ ఉండేవాళ్లకూ వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు అందాయని, వాళ్లెవరూ చంద్రబాబుపై అభిమానం తో రావడంలేదని మంత్రి గుర్తుచేశారు.  

విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ను నిర్మించలేని అసమర్థుడు చంద్రబాబు అని ఎద్దేవాచేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే దాన్ని శరవేగంగా పూర్తిచేసిందని గుర్తుచేశారు. 2018లో 40 నుంచి వంద శాతానికి నీటి పన్నులు పెంచుతూ జీఓ ఇచ్చిన ఘనుడని మండిపడ్డారు. ఇలాంటి ఆయన పన్ను తగ్గిస్తానని మేనిఫెస్టోలో చెప్పడం నయవంచన కాదా? అని ప్రశ్నించారు. విజయవాడ కార్పొరేషన్‌ లోని 64 స్థానాలనూ వైఎస్సార్‌సీపీ ౖకైవసం చేసు కుని మేయర్‌ పీఠం దక్కించుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. టీడీపీలో బీఫారాలు కూడా తీసుకునే పరిస్థితి లేక ఎక్కడెక్కడి వాళ్లనో నిలబెట్టారని ఎద్దే వా చేశారు.  కరోనా కష్టకాలంలో హైదరాబాద్‌లో కూర్చుని జూమ్‌ మీటింగ్‌లు పెట్టిన చంద్రబాబును ప్రజలు దగ్గరకు రానివ్వరని వెలంపల్లి చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top