ఉత్తరాఖండ్‌ బరిలో 632 మంది పోటీ

Uttarakhand: 632 Candidates On 70 Assembly Seats Will Contest Election - Sakshi

డెహ్రాడూన్‌: ఈనెల 14న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 632 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని 81.43 లక్షలమంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. నామినేషన్‌ వేసిన వారి నుంచి 95మంది ఉపసంహరించుకోగా 632 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో అత్యధికంగా 136 మంది స్వతంత్ర అభ్యర్థ్ధులున్నారు. డెహ్రాడూన్‌ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 117 మంది, హరిద్వార్‌ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో 110మంది పోటీచేస్తున్నారు.

చంపావత్, బాగేశ్వర్‌ జిల్లాల్లోని నియోజకవర్గాల నుంచి 14మంది పోటీపడుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య నెలకొంది. బరిలో ఎస్‌పీ, ఆప్, బీఎస్‌పీ, యూకేడీ కూడా ఉన్నాయి. ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top