2024 సెమీఫైనల్స్‌: 2023లో ఎన్నికలు జరిగే కీలక రాష్ట్రాలివే..

Semi Finals For 2024 General Elections Which States Vote In 2023 - Sakshi

2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కానీ, అంతకు ఏడాది ముందే దేశంలో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2023లో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలు అధికారంలోని బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్‌కు కీలకం కానున్నాయి. 

► ఈశాన్య రాష్ట్రాలు: 2023 ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య మూడు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్‌లో మిజోరాంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిపురలో ఐపీఎఫ్‌టీతో కలిసి అధికారంలో ఉంది బీజేపీ. అలాగే నాగాలాండ్‌, మేఘాలయాల్లో అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. మిజోరాంలో ప్రధానంగా కాంగ్రెస్‌, అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ మధ్యే పోటీ ఉంటుంది. ప్రధానంగా త్రిపుర ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తొలిసారి 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ప్రస్తుతం వ్యతిరేకత మింగుడుపడటం లేదు. 

► కర్ణాటక: దక్షిణభారతంలో బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రం కర్ణాటక. 2023లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, జనతా దళ్‌(సెక్యులర్‌)ల మధ్యే పోటీ ఉంటుంది. కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తోంది. మరోవైపు.. పార్టీలో తిరుగుబాటు నేతలను బుజ్జగించి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. 

► తెలంగాణ: దేశంలో కొత్త ఏర్పాడిన రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరగనున్నాయి. దేశ రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా అవతరించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్‌కు ఎంతో కీలకంగా మారాయి. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్‌లు అధికార మార్పిడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దక్షిణాదిలో పట్టు సాధించేందుకు తెలంగాణలో తమ బలం చూపించుకోవలాని బీజేపీ భావిస్తోంది. 

► మధ్యప్రదేశ్‌: 2023 నవంబర్‌-డిసెంబర్‌ మధ్య మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్యే ఇక్కడ ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాటుతో సీఎంగా కమల్‌నాథ్‌ దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ అధికారం చేపట్టింది. దేశంలో రెండే అతిపెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో విజయం సాధించటం ద్వారా 2024 లోక్‌సభ ఎన్నికలపై పట్టు సాధించాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. 

► ఛత్తీస్‌గఢ్‌-రాజస్థాన్‌: 2024 ఎన్నికలకు ముందు ఈ రెండు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. మరోవైపు.. రాజస్థాన్‌లో సీఎం అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ మధ్య వర్గ పోరు ప్రధనా ఆకర్శనగా నిలుస్తోంది. అలాగే, రాష్ట్రాల్లో అధికార మార్పిడి సంప్రదాయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

ఇదీ చదవండి: నీకే కాదు.. నీ తండ్రికి కూడా ఎవరూ భయపడటం లేదు: ఫడ్నవీస్‌

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top