స్థానిక ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి: సజ్జల | Sajjala Ramakrishna Reddy holds a teleconference YSRCP senior leaders | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి: సజ్జల

Oct 11 2026 9:58 PM | Updated on Oct 11 2026 10:01 PM

Sajjala Ramakrishna Reddy holds a teleconference YSRCP senior leaders

తాడేపల్లి:  స్థానిక ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి సూచించారు.  ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం చూడకుండా ఏర్పాట్లు చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల కుల ధ్రువీకరణ, నో డ్యూస్‌ సర్టిఫికెట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. ఈరోజు(ఆదివారం, అక్టోబర్‌ 11వ తేదీ) వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

‘జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ఎన్నికల వార్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలి. ప్రతీ గ్రామానికీ న్యాయం సహాయం అందేలా లీగల్‌ నెట్‌వర్క్‌ నామినేషన్ల నుంచి  కౌంటింగ్‌ వరకు లీగల్‌ టీమ్‌లు అప్రమత్తంగా ఉండాలి. రిజర్వేషన్ల రోస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అవకతవకలపై న్యాయ పోరాటం చేయాలి. ఎన్నికల అక్రమాలను రాజకీయంగా ఎన్నికల సంఘం ద్వారా, న్యాయపరంగా ఎదుర్కోవాలి. 

సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలి. అభ్యర్థులపై పోలీసుల వేధింపులు, బైండ్ ఓవర్ కేసులను ఆధారాలతో రికార్డు చేయాలి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలను వీడియో ఆధారాలతో నమోదు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక మీడియా, డిజిటల్ టీమ్‌లు ఏర్పాటు చేయాలి’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కుప్పంలో చంద్రబాబుకు షాక్.. వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement