చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీకి షాక్ తగిలింది. స్థానిక సంస్థలు నోటిఫికేషన్‌కు ముందే వైఎస్సార్‌సీపీలో ఈ చేరికలు జోష్ పెంచుతున‍్నాయి. గుడుపల్లి మండలం చిన్న గొల్లపల్లి పంచాయతీ, పి.బి.వాడకు చెందిన 14 కుటుంబాలకు చెందిన సభ్యులు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
కుప్పం మండలం అడవి బూదగురు పంచాయతీలో వైఎస్సార్‌సీపీలోకి తెలుగుదేశం పార్టీకి చెందిన 12 కుటుంబాలకు చెందిన పెద్దలు చేరారు. వారు వైఎస్సార్‌సీపీలో చేరడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని భరత్ తెలిపారు.


