కొలికపూడి తలెక్కడ దాచుకున్నాడు: వర్మ | Sakshi
Sakshi News home page

కొలికపూడి తలెక్కడ దాచుకున్నాడు: వర్మ

Published Sat, Dec 30 2023 5:04 PM

Rgv Comments On Kolikipudi Srinivas Rao - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తల నరుకుతా అన్నవాడు.. తల ఎక్కడ దాచుకున్నాడు? అని సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ప్రశ్నించారు. తన తల నరికి తెస్తే కోటి రూపాయల బహుమతి ఇస్తానన్న కొలికపూడి శ్రీనివాసరావుపై రెండు రోజుల  క్రితం ఆర్‌జీవీ ఆంధ్రప్రదేశ్‌ డీజీపికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొలికిపూడిపై కేసు నమోదు చేశారు.  

ఈ కేసు విచారణలో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు కొలికిపూడిని అరెస్ట్‌ చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని కొలికిపూడి ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. కొలికపూడి ఇంట్లో లేకపోవడంతో అయన ఇంటి దగ్గరే పోలీసులు ఎదురు చూస్తున్నారు.కేసు గురించి కొలికపూడి భార్యకు సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు.  వ్యూహం సినిమా విషయంలో కొలికిపూడి వర్మపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఇదీచదవండి..జగన్‌ పదునైన ప్రశ్నలు

Advertisement
 
Advertisement
 
Advertisement