ఇంటెలిజెన్స్‌ ఐజీకి రాజాసింగ్‌ లేఖ.. ‘నా భద్రతకు ముప్పు ఉంది!’

Raja Singh Wrote Letter To Intelligence IG For Vehicle Change - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే రాజాసింగ్‌.. ఇంటెలిజెన్స్‌ ఐజీకి లేఖ రాశారు. తన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని మార్చాలని లేఖలో ఐజీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న తన వాహనం తరచూ మొరాయిస్తోందని లేఖలో చెప్పుకొచ్చారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి దారుణం అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. నా భద్రతకు ముప్పు ఉంది. కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఇవ్వడానికి కేసీఆర్‌ అనుమతి లేదా?. లేక అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నలు సంధించారు. టెర్రరిస్టులు, యాంటీ సోషల్ యాక్టీవిస్ట్‌లు తనపై దాడి చేసే అవకాశం కల్పిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

తన లైఫ్ డేంజర్‌లో ఉందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉందన్నారు. వెంటనే కొత్త వాహనాన్ని కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. అంతుకుముందు తన వాహనంలో వెళ్తుండగా కారు మొరాయించడంతో రాజాసింగ్‌ వేరే వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. కాగా, పీడీ యాక్ట్‌లో భాగంగా రాజాసింగ్‌ జైలుకు వెళ్లి.. ఇటీవలే కోర్టు ఆదేశాల అనంతరం బయటకు వచ్చిన విషయం తెలిసిందే.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top