బలీయమైన శక్తిగా ఎదుగుతాం: పురందేశ్వరి

Purandeswari Said Role Of The Center In Matter Of Capital Very Limited - Sakshi

పొత్తుపై అధిష్టానానిదే నిర్ణయం

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి

సాక్షి, ప్రకాశం జిల్లా: రాజధాని విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితమైనదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన కంటే  ప్రతిభావంతులైన వారు బీజేపీలో ఉన్నప్పటికి తనకు ప్రాధాన్యత ఇచ్చినందుకు శక్తి వంచన మేరకు దక్షిణ ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు బీజేపీ అధిష్టానానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: జేపీ నడ్డా టీం: రామ్‌ మాధవ్‌కు దక్కని చోటు!)

పదాధికారులతో సమావేశం అనంతరం రాష్ట్రంలో ఎటువంటి వ్యూహాలపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందో ఆ మేరకు దక్షిణ ప్రాంతంలో అమలు పరుస్తామని పేర్కొన్నారు. దక్షిణ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నకాలంలో బీజేపీ అధికారంలోకి తేవడం అంత ఆషామాషీ కాదని కాని ప్రజల పక్షాన నిలిచి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తామన్నారు. తద్వారా బలీయమైన శక్తిగా ఎదుగుతామని తెలిపారు. వ్యవసాయ బిల్లులో ఒకటి రెండు అంశాల్లో ఆందోళన ఉన్నప్పటికీ రైతులకు మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని పురేందశ్వరి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top