‘మీరు ఇక్కడే ఉండండి.. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా’.. ఇదేం తీరు బాబూ..

People Angry About Chandrababu Behavior In Kandukur - Sakshi

కందుకూరు(నెల్లూరు జిల్లా): కందుకూరులో తొక్కిసలాట సమయంలో బాబు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల వద్దకు వెంటనే వెళ్లాల్సిందిపోయి నాయకుల్ని పంపాను. విషయం తెలుసుకుంటున్నాను. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా.. ఎక్కడికీ వెళ్లొద్దని ఆయన చెప్పడంపై ప్రజలు మండి పడుతున్నారు.

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి ప్రచార యావ చాలా ఎక్కువ. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోడు. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఈ వ్యవహారశైలే మరోసారి ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి యాత్ర సందర్భంగా కందుకూరులో బుధవారం టీడీపీ నాయకులు నిర్వహించిన బహిరంగసభ కొందరి కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది.

అసలే 30 అడుగుల ఇరుకు రోడ్లు. దాన్లో కూడా అటూ ఇటూ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి... 20 అడుగులకు కుదించేశారు. ఆ ఇరుకు రోడ్లో ఐదారు వేల మంది వచ్చినా... పై నుంచి డ్రోన్లతో షూటింగ్‌ చేస్తే చాలా భారీగా జనం తరలివచ్చినట్లు కనిపిస్తుంది. ఆ ఫొటోలను పత్రికల్లో, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారా ప్రతి సభకూ, రోడ్‌ షోకూ జనం పోటెత్తుతున్నారని చెప్పటం చంద్రబాబు నాయుడి ఉద్దేశం. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చంద్రబాబు రోడ్‌ షోలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఈ ఫార్ములా... బుధవారం మాత్రం కందుకూరులో ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది.
చదవండి: బాబుదే పాపం.. ప్రాణాలు తీసిన ప్రచార యావ  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top