హుజూరాబాద్‌ ఉప ఎన్నిక: ఈ ఇద్దరి నాయకుల కీలక పాత్ర

Medak: Harish Rao, Damodar Raja Narasimha Key Role In Huzurabad By Polls - Sakshi

టీఆర్‌ఎస్‌ నుంచి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

కాంగ్రెస్‌కు మాజీ డిప్యూటీ సీఎం దామోదర

Huzurabad Bypoll: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ తర్వాత హుజురాబాద్‌ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌ మారింది. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే  ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన ఇద్దరు అగ్రనేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ.హరీశ్‌రావు హుజురాబాద్‌ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తుండగా.. కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అందోల్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగించింది. దీంతో ఈ ఉపఎన్నికలో జిల్లాకు చెందిన ముఖ్యనేతలిద్దరూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

హరీశ్‌రావుకు ట్రబుల్‌ షూటర్‌గా పేరుంది. గతంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఆయన ముందుండి నడిపించారు. అధినేత, సీఎం కేసీఆర్‌ వ్యూహాలను పకడ్బందీగా ఆచరణలో పెట్టగల సమర్థుడిగా పేరున్న హరీశ్‌రావు ఇప్పటికే ఈ హుజురాబాద్‌ ఉప ఎన్నిక రంగంలో దిగారు.  కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉప ఎన్నిక నిర్వహణ బాధ్యతలను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.  టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గంలో దామోదరకు కీలక పదవి వరించిన విషయం విదితమే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top