ఇక బీజేపీకి గుడ్‌ బై: మాజీ సీఎం తనయుడు

Manohar Parrikars Son Utpal Resigns From BJP - Sakshi

పనాజీ(గోవా): తాను ఆశించిన పనాజీ అసెంబ్లీ స్థానంలో బీజేపీ సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేశారు. ఇక తాను బీజేపీలో కొనసాగలేనంటూ శుక్రవారం తన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. అదే సమయంలో పనాజీ స్థానం నుంచే ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీగా దిగుతానని ప్రకటించారు. 

కాగా, గత కొన్ని రోజులుగా పనాజీ స్థానాన్ని ఆశిస్తున్న ఉత్పల్‌ పారికర్‌కు బీజేపీ గురువారమే షాక్‌ ఇచ్చింది. ఆ స్థానాన్ని సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు ఇవ్వడంతో ఉత్పల్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. అయితే పనాజీ కాకుండా బీజేపీ అధిష్టానం సూచించిన రెండు స్థానాల నుంచి పోటీ చేయడానికి ఉత్పల్‌ నిరాకరించారు. అదే సమయంలో ఇక ఎంతో ముచ్చటపడుతున్న పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దిగాలనే యోచనలోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఉత్పల్‌ వెల్లడించారు. 

ఇక్కడ చదవండి: ‘ఆ సీటు వేరే వాళ్లకి ఇచ్చాం.. మరో ప్లేస్‌ ఎన్నుకోండి’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top