ఆ రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం | Sakshi
Sakshi News home page

ఆ రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం

Published Wed, May 15 2024 5:06 AM

KTR comments on Congress and BJP

కేంద్రంలో ప్రాంతీయ శక్తులదే నిర్ణయాత్మక పాత్ర: కేటీఆర్‌

తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్‌ఎస్సే శ్రీరామరక్ష

ఐదు నెలల్లో కాంగ్రెస్‌ ప్రజల నమ్మకం కోల్పోయింది

బీజేపీ, కాంగ్రెస్‌లది ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అని వ్యాఖ్య

సిరిసిల్ల: జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయని.. రేపు కేంద్రంలో ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామా రావు పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్లలో ఆయ న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పారు.

 రైతుల రుణాలను మాఫీ చేయకుండా, రూ.500 బోనస్, మహిళలకు రూ. 2,500, పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు తదితర హామీలు ఏమయ్యాయని నిలదీశారు. జనవరి నెల పెన్షన్లు కూడా ఇవ్వకుండా మింగేశారని ఆరోపించారు. కొ త్త జిల్లాల రద్దు, మేడిగడ్డ కుంగుబాటు, శ్వేతపత్రం, ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ.. కాంగ్రెస్‌ ఐదు నెలల పాటు టైంపాస్‌ పాలన సాగించిందని మండిప డ్డారు. ఈనాడైనా, ఏనాడైనా.. తెలంగాణకు బీఆర్‌ ఎస్‌ పార్టీయే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.

వారిది ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ..
కాంగ్రెస్, బీజేపీ రెండూ ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్‌ ఆరోపించారు. ఆ రెండు పార్టీలు తమ నేతలను చేర్చుకుని టికెట్లు ఇచ్చాయని.. ఒకదానికితోడుగా మరొకటి లోక్‌సభ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను బరిలో దించాయని విమర్శించారు. జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి కరీంనగర్‌లో పోటీ చేస్తానంటే నిజా మాబాద్‌ బరిలో దింపారని.. కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో ఎవరికీ తెలియదని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కిషన్‌రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్‌రెడ్డి కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ, ఇండియా కూటముల కంటే ప్రాంతీయ పార్టీల కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని,. అందులో వైఎస్సార్‌సీపీ, బిజూ జనతాదళ్, బీఆర్‌ఎస్‌ పార్టీలు భాగస్వాములవుతాయని కేటీఆర్‌ చెప్పారు.

కేసీఆర్‌ బస్సుయాత్ర ఎన్నికలను మలుపు తిప్పింది
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీ ఆర్‌ 17 రోజుల పాటు 30 చోట్ల చేసిన బస్సుయాత్ర, రోడ్‌ షోలు లోక్‌సభ ఎన్నికలను మలుపు తిప్పాయని కేటీఆర్‌ చెప్పారు. కేసీఆర్‌ రాష్ట్రంలో ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి వెళ్లి నా ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. కేసీఆర్‌ కాలుపెట్టిన ప్రతి చోట ఆదిలాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకు గులాబీ సైన్యం గుండెల నిండా ఆత్మవిశ్వాసం కనిపించిందన్నారు. కేసీఆర్‌ రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించారని చెప్పారు.

రుణమాఫీ చేయని రేవంత్‌రెడ్డి తారీకులు మార్చుతూ, దేవుళ్లపై ఒట్టు వేస్తూ.. కాంగ్రెస్‌పై నమ్మ కం లేని పరిస్థితిని తెచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరెంట్, తాగునీటి సమస్యలు మొదల య్యాయని.. కేసీఆర్‌ ఉన్నప్పుడే బాగుండేది అనే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వ పరిస్థితి బాగుండదన్నారు. సమావేశంలో టెస్కాబ్‌ చైర్మ న్‌ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement