కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా?

Komatireddy Rajagopal Reddy Slams Revanth Reddy After Resigns Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే రోజుల్లో రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడం ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్‌ ఇంకా చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. పీసీసీగానే కాదు.. ఏఐసీసీ ప్రెసిడెంట్‌ అయినా ఆయనను ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. రేవంత్‌కు వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడలేదని, 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు ఏం చేశారని నిలదీశారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. 

‘రేవంత్‌రెడ్డి బ్రాండ్‌నేమ్‌ బ్లాక్‌మెయిల్‌. జయశంకర్‌, కోదండరామ్‌ను తిట్టిన చరిత్ర నీది. వైఎస్సార్‌ మరణంపై కూడా విమర్శలు చేశాడు. సోనియాను తిట్టిన వ్యక్తి నా గురించి మాట్లాడుతున్నాడు. కొడంగల్‌లో ఓడిపోయావు. పాలమూరు ఎంపీగా ఎందుకు పోటీ చేయలేదు. సీమాంధ్రుల ఓట్ల కోసం మల్కజ్‌గిరిలో పోటీ చేశావు. కాంగ్రెస్‌లోకి వచ్చి మాకు నీతులు చెబుతున్నావు.  నీలాంటి వాడితో మేము చెప్పించుకోవాలా!

పీసీసీ చీఫ్‌ అయ్యాక ఇంటికి వస్తా అంటే వద్దు అన్నా. జైలుకు వెళ్లి వచ్చినవాడు ఇంటికొస్తే మురికి అవుతుందని వద్దన్నా. ఎవరినీ పండపెట్టి తొక్కుతవ్‌. నువ్వు ఉన్నది మూడు ఫీట్లు, నన్ను తొక్కుతావా? ఎక్కడికి వెళ్లినా జిందాబాద్‌ కొట్టించుకుంటావు. నిన్ను సీఎంగా తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? హుజురాబాద్‌ వెళ్లి ఏం చేశావు. మునుగోడుకు నువ్వు వస్తే డిపాజిట్‌ కూడా రాదు. నీలాంటి చిల్లర దొంగ దగ్గర పనిచేసే ప్రసక్తే లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్‌ చచ్చిపోయింది’ అని రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు రాజగోపాల్‌ రెడ్డి.
ఇది కూడా చదవండి: రేవంత్‌ రెడ్డిని ఉతికి ఆరేసిన కోమటిరెడ్డి.. సిగ్గూశరం ఉంటే ఆ పని చెయ్‌!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top