Kodali Nani Sensational Comments On Nara Lokesh And Chandrababu Naidu And Balakrishna - Sakshi
Sakshi News home page

బాలకృష్ణ, లోకేష్‌, బాబుపై కొడాలి నాని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Published Mon, May 29 2023 10:41 AM

Kodali Nani Sensational Allegations Over TDP Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత చంద్రబాబు లేదని అన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల పేరుతో చంద్రబాబును పొగిడించుకుంటున్నారని విమర్శలు చేశారు నాని. 

కాగా, కొడాలి నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబును పొగిడించుకోవడానికే మహానాడు పెట్టారు. చంద్రబాబు.. ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారు. మహానాడు వేదిక మీద బాలకృష్ణ బొమ్మ ఎందుకు పెట్టలేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవని నారా లోకేష్‌ బొమ్మ ఎలా పెడతారు. ఎన్టీఆర్‌ పేరుతో నాలుగు ఓట్ల కోసమే ఈ తపనంతా. ప్రశ్నిస్తానంటూ జనసేన పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబుకు ఓటేయించారు. 

టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీలు చంద్రబాబు నిర్వహించలేదు. అదే వైఎస్సార్‌ 2004లో ఇచ్చిన ప్రతీ హామీ నిర్వహించారు. మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ఇవ్వని పథకాలు కూడా అమలు చేశారు. 2019లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మాట తప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి మాఫీ చేయలేదు. చంద్రబాబు ఐదేళ్లలో పెన్షన్లకు రూ.22వేల కోట్లు ఖర్చు చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.97వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. సెంటు స్థలం ఇస్తే సమాధికి సరిపోదు అంటున్నారు. 14ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఎందుకు ఇళ్లు ఇవ్వలేదు. 

బీసీలకు చట్టం తెస్తానని చంద్రబాబు మోసపూరిత హామీ ఇచ్చారు. చంద్రబాబు వెనుక బీసీలెవరూ లేరు. చంద్రబాబు వెంట ఉన్నది.. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, పవన్‌ కల్యాణ్‌. వీళ్లెవరూ బీసీలు కాదు.. అధికారం ఇస్తే బాబుతో పాటు వీళ్లే బాగుపడతారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే తన సామాజికవర్గానికే మంత్రి పదవులు ఇస్తారు. చంద్రబాబును ఆల్‌ఫ్రీ బాబు అని వైఎస్సార్‌ ఆనాడే చెప్పారు. చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఎన్టీఆర్‌ ఆనాడే అన్నారు. చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎంత ఇచ్చాడు?. రాష్ట్రంలో చంద్రబాబు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చాడా?. టీడీపీ హయాంలో లోకేష్‌కు తప్ప రాష్ట్రంలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదు’ అంటూ సీరియస్‌ కామెం‍ట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: విభజన సమస్యలు పరిష్కరించండి: సీఎం వైఎస్‌ జగన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement