బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్‌: కేజ్రీవాల్‌ సంచలన కామెంట్స్‌ | Kejriwal Sensational Comments On Yogi Adityanath | Sakshi
Sakshi News home page

బీజేపీ గెలిస్తే ‘యోగి’కి అవుట్‌: కేజ్రీవాల్‌ సంచలన కామెంట్స్‌

May 11 2024 4:52 PM | Updated on May 11 2024 5:18 PM

Kejriwal Sensational Comments On Yogi Adityanath

న్యూఢిల్లీ: లిక్కర్‌స్కామ్‌లో జైలు పాలై మధ్యంతర బెయిల్‌పై బయటికి రాగానే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీ అంతర్గత వ్యవహారాలపై సంచలన కామెంట్స్‌ చేశారు. శనివారం(మే11) ఢిల్లీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో కేజ్రీవాల్‌ ప్రసంగించారు. 

బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రాజకీయ జీవితాన్ని అంతం చేస్తారన్నారు. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దేశానికి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.మోదీ రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతారన్నారు.

గతంలో బీజేపీలో రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిన ఎల్‌కే అద్వానీ, మురళి మనోహర్‌ జోషి, సుమిత్ర మహాజన్‌, యశ్వంత్‌ సిన్హాల పేర్లను కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం మోదీ ఓట్లడుగుతన్నది అమిత్‌ షా కోసమేనని మోదీ ఇస్తున్న గ్యారెంటీని అమిత్‌ షా నెరవేరుస్తారా అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement