
సాక్షి, తాడేపల్లి : ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజా ప్రతినిధులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. ఇలాంటి ప్రజా ప్రతినిధిని ప్రజలే తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామగిరి పాకిస్తాన్ బోర్డర్‌లో ఉందా?. పర్మిషన్ లేకుండా అక్కడకు వెళ్లటానికి వీల్లేదని పోలీసులు అంటున్నారు. పల్నాడులో పోలీసుల సమక్షంలోనే ఇళ్లను కూల్చేశారు. మద్దెకెరలో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రాణాలు తీశారు. ఏపీలో శాంతి భద్రతలు లోపించాయి. శాంతి భద్రతలు లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. పెదబాబు, చిన్నబాబు రూ.30 కోట్లు ఖర్చుతో దావోస్ వెళ్లినా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.
ముస్సోరీ, గడాఫీకి పట్టిన గతే త్వరలోనే చంద్రబాబుకు పడుతుంది. ప్రజలు చంద్రబాబును తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉంది. సోషల్ మీడియా కార్యకర్తలపై 20, 30 కేసులు చొప్పున పెట్టి వేధించారు. ప్రజా ప్రతినిధులు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని తిరుగుతారు. కానీ చంద్రబాబు పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. 30 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు. మరి మీ పాలనలో ఒక్కరినైనా వెనక్కు తెచ్చారా?’ అని ప్రశ్నించారు.