‘అలీబాబా అర డజను దొంగల్లో నువ్వూ ఒకడివి’ | Tirumala Parakamani: Ysrcp Tweet On Nara Lokesh Allegations | Sakshi
Sakshi News home page

‘అలీబాబా అర డజను దొంగల్లో నువ్వూ ఒకడివి’

Sep 20 2025 6:58 PM | Updated on Sep 20 2025 7:23 PM

Tirumala Parakamani: Ysrcp Tweet On Nara Lokesh Allegations

సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ ఫైర్‌ అయ్యింది. తిరుమల పరకామణిని సైతం తన రాజకీయాలకు వాడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, లోకేష్‌కు ఒక అలవాటుగా మారింది. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే. సిగ్గు, శరం వదిలేసి బరితెగించి విషప్రచారం చేయడంలో ఇద్దరూ హేమాహేమీలు. పరకామణిలో చోరీ విషయంలోనూ చంద్రబాబువి పచ్చి అబద్ధాలు’’ అంటూ వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది.

‘‘దశాబ్దాలుగా పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్‌ను పట్టుకున్నది 2023, ఏప్రిల్‌లో. అంటే వైఎస్సార్‌సీపీ హయాంలో. లోకేష్‌ నువ్వైతే పంచాయతీ చేసి రవికుమార్‌ ఆస్తులను కొట్టేసేవాడివి.. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పోలీసులు నిశిత విచారణ జరపడంతో, రవికుమార్‌ కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి గిఫ్టురూపంలో ఇచ్చేశారు. ఇదంతా చట్టప్రకారం, కోర్టులు నిర్దేశించిన న్యాయసూత్రాల ప్రకారం పారదర్శకంగా జరిగింది.

..లోకేష్‌.. నువ్వైతే పంచాయతీలు చేసి, ఈ ఆస్తులను కొట్టేసి, దొంగ పెట్టుబడుల రూపంలో ఏ దుబాయ్‌కో తరలించేవాడివి. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఓ స్లోగన్ నడుస్తోంది.. క్యాష్.. సూట్‌కేసు.. రాజేష్‌.. లోకేష్‌.. అని. ఈ ప్రభుత్వంలోని అలీబాబా అరడజను దొంగల్లో నువ్వు ఒకడివి’’ అంటూ వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement