బీజేపీలో సాధారణ వ్యక్తి సైతం సీఎం, పీఎం కూడా అవ్వొచ్చు | Former Bjd Mp Prabhas Kumar Singh Joins Bjp | Sakshi
Sakshi News home page

బీజేపీలో సాధారణ వ్యక్తి సైతం సీఎం, పీఎం కూడా అవ్వొచ్చు

Apr 15 2024 6:22 PM | Updated on Apr 15 2024 7:13 PM

Former Bjd Mp Prabhas Kumar Singh Joins Bjp - Sakshi

న్యూఢిల్లీ : ఒడిశా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒడిశా అధికార పార్టీ  బిజు జనతాదళ్ (బీజేడీ) మాజీ ఎంపీ ప్రభాస్ కుమార్ సింగ్ బీజేపీలో చేరారు.

ఒడిశా బార్‌ఘర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన ప్రభాస్‌ కుమార్‌ సింగ్‌.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, ఇతర సీనియర్ సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 

పొత్తులు విఫలం
ఒడిశాలో అధికార బిజు జనతాదళ్, భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. పదేళ్లుగా అనధికార మిత్రులుగా కొనసాగిన ఇరు పార్టీలు.. పదిహేనేళ్ల తర్వాత అధికారికంగా జట్టు కట్టేందుకు జరిగిన చర్చలు ఫలించలేదు. ఒంటరి పోరు తమకే లాభమని ఇరుపార్టీలు భావించాయి. ఈ తరుణంలో బీజేడీ-బీజేపీల మధ్య పొత్తుల చర్చలు విఫలం కావడంతో పలువురు ఒడిశా అధికార పార్టీ బీజేడీ నేతలు బీజేపీలో చేరుతున్నారు.

మోదీ వ్యక్తిత్వం
తాజాగా ప్రభాస్‌ కుమార్‌ సింగ్‌ బీజేపీలో చేరారు. ‘ఇది నాకు ప్రత్యేకమైన క్షణం. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం నన్ను బాగా ప్రభావితం చేసింది. సమయంలో బిజూ జనతాదళ్ (బీజేడీ)పై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేడీలో గౌరవం, ఆత్మగౌరవం లేదు. ఒడియా కళ సంస్కృతి, వారసత్వం పట్ల గౌరవం లేదని మండిపడ్డారు.  

సాధారణ వ్యక్తి సీఎం,పీఎం అవ్వొచ్చు
దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న ప్రభాస్‌ కుమార్‌ సింగ్‌.. గడిచిన 10ఏళ్లలో బీజేపీ దేశ ప్రజలకు చేసిన కృషిని కొనియాడారు. బీజేపీలో గౌరవం, ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం ఉన్నాయి. ఇక్కడ (బీజేపీలో) సాధారణ వ్యక్తి కూడా ప్రధాని, ముఖ్యమంత్రి కాగలడు. బీజేపీలో చేరడం నా అదృష్టమని తెలిపారు. 

ఒడిశాలో గెలుపు మాదే
ఒడిశాలో బీజేపీ విజయ బావుటా ఎగురవేస్తుందని, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభాస్‌ కుమార్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement