నాంపల్లి నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం... | Sakshi
Sakshi News home page

నాంపల్లి నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం...

Published Fri, Aug 4 2023 12:22 PM

Candidate Have A Hat Trick Chance In Nampally Constituency - Sakshi

నాంపల్లి నియోజకవర్గం

2009లో నియోజకవర్గ పునర్ విభజనలో అసిఫ్‌నగర్‌ నియోజకవర్గం రద్దై నాంపల్లి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.

నాంపల్లి నియోజకవర్గంలో మజ్లిస్‌ నేత జాఫర్‌ హుస్సేన్‌ రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది ఫిరోజ్‌ ఖాన్‌పై 9700 ఓట్ల  మెజార్టీతో గెలుపొందారు. పిరోజ్‌ ఖాన్‌ గతంలో ఫిరోజ్‌ ఖాన్‌ ప్రజారాజ్యం, టిడిపిల పక్షాన పోటీచేసి ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్‌ ఐ టిక్కెట్‌పై ప్రయత్నించినా లాభం దక్కలేదు. జాఫర్‌ హుస్సేన్‌కు 57940 ఓట్లు రాగా, పిరోజ్‌ ఖాన్‌కు 48265 ఓట్లు వచ్చాయి.  ఇక్కడ టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన సిహెచ్‌ ఆనందకుమార్‌కు సుమారు పదిహేడు వేల ఓట్లు వచ్చాయి. నాంపల్లిలో 2014లో  మజ్లిస్‌ పార్టీ   విరాసత్‌ రసూల్‌ఖాన్‌ను మార్చి జాఫర్‌ హుస్సేన్‌కు అవకాశం ఇచ్చింది.  రసూల్‌ ఖాన్‌ ఇక్కడ ఒకసారి గెలవగా, గతంలో రెండుసార్లు అసిఫ్‌నగర్‌ నుంచి ఒకసారి చార్మినార్‌ నుంచి విజయం సాధించారు.  కొత్త నియోజకవర్గంగా నాంపల్లి ఏర్పడినప్పటినుంచి  ముస్లింలే గెలుపొందారు.

అసిఫ్‌నగర్‌ ప్రత్యేకత (2009లో రద్దు)

2009లో రద్దు అయిన అసిఫ్‌నగర్‌ నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఏడుసార్లు, ఇండిపెండెంట్లు నాలుగు సార్లు, ఎమ్‌.ఐ.ఎమ్‌. రెండుసార్లు, టిడిపి ఒకసారి గెలిచాయి. అయితే ఇండిపెండెంట్లుగా గెలిచిన వారంతా కూడా మజ్లిస్‌ వారే. 2009,2018లలో ఖైరతాబాద్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌ అసిఫ్‌నగర్‌లో మూడుసార్లు గెలిచారు. అసిఫ్‌నగర్‌లో రెండుసార్లు కాంగ్రెస్‌ ఐ తరుపున గెలుపొందిన ఈయనకు 2004లో కాంగ్రెస్‌ ఐ పక్షాన అసెంబ్లీ టికెట్‌ కాకుండా లోక్‌సభ టికెట్‌ ఇవ్వడంతో నిరసనగా పార్టీని వదిలి టిడిపి పక్షాన పోటీ చేసి మూడోసారి  గెలిచారు. కాని కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీలో నిలబడ్డారు. కాని గెలుపొందలేకపోయారు.

తిరిగి 2009లో ఖైరతాబాద్‌ నుంచి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2018లో టిఆర్‌ఎస్‌ పక్షాన గెలిచారు. 2008 ఉప ఎన్నికలో గెలిచిన మౌజంఖాన్‌ ఆ తర్వాత 2009లో బహదూర్‌పుర నుంచి గెలిచారు. ప్రముఖ నేత విబిరాజు ఇక్కడ ఒకసారి, సికింద్రాబాదు, సిద్దిపేటల నుండి ఒక్కొక్కసారి గెలిచారు. వి.బి.రాజు రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. అసిఫ్‌నగర్‌ నుంచి రెండుసార్లు గెలుపొందిన ఎమ్‌.ఎమ్‌. హషీం మరో రెండుసార్లు సికింద్రాబాద్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. హషీం శాసనమండలి సభ్యునిగా కూడా ఎన్నికై చెన్నారెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. వి.బి రాజు కూడా నీలం, కాసు, మంత్రివర్గాలలో పనిచేశారు.

1957లో గెలిచిన వి.బిరాజుపైన, అలాగే 1967లో తాండూరులో గెలిచిన చెన్నారెడ్డిపైన ఎన్నికల పిటిషన్లు వేసి రెండుసార్లు ఇద్దరిని అనర్హులను చేయించిన ఘనత వందేమాతరం రామ చంద్రరావుకు దక్కుతుంది. వందేమాతరం 1959లో ఉప ఎన్నికలో గెలుపొందారు. అలాగే 1962లో కూడా ఇండిపెండెంటుగా మేడ్చల్‌లో పోటీచేసి చెన్నారెడ్డి  మేనమామ, మాజీ ఉప ముఖ్యమంత్రి కె.వి. రంగారెడ్డిని ఓడిరచిన ఘనత కూడా వందేమాతరం రామ చంద్రరావుకు దక్కుతుంది. ఇలా ముగ్గురు ప్రముఖులను ముప్పతిప్పలు పెట్టిన ఘనాపాటిగా ఈయన ప్రసిద్ధిగాంచారు. విబి రాజు బ్రాహ్మణ వర్గం వారు కాగా, వందేమాతరం రామచంద్రరావు వెలమ వర్గం వారు, బి.కృష్ణ, దానం నాగేందర్‌లు బిసి వర్గం వారు. మిగిలినవారు ముస్లింలు.

నాంపల్లి నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Advertisement
 
Advertisement
 
Advertisement