పొంగులేటి, జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన బీఆర్‌ఎస్‌

BRS Suspends Ponguleti Srinivas Reddy Jupally Krishna Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్‌ఎస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ముఖ్యమంత్రి సస్పెండ్‌ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ కార్యాలయం వెల్లడించింది.ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ చర్యలు చేపట్టింది. 

కాగా పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో సుమారు 300 మంది శ్రీనివాసరెడ్డి వర్గీయులు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు.  రాజీనామా చేసిన వారిలో మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సొసైటీ డైరెక్టర్‌లు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉన్నారు.

ఇదిలా ఉండగా గతకొద్ది రోజులుగా జూపల్లి, పొంగులేటి.. బీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖమ్మంలో తనవర్గం నేతలతో పొంగు లేటి భేటి అవుతున్నారు. కొత్తగూడెంలో ఆదివారం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్‌ ఆత్మీయ సమావేశంలోనూ జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. ఇద్దరు కలిసి కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సింగరేణిని అప్పుల కుప్పగా మార్చారని, కార్మికులను అవమానించారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం, దాన్ని నడిపిస్తున్న సీఎం ఎనిమిదిన్నరేళ్ల కాలంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదన్నారు.

చదవండి: బండి సంజయ్‌ ఫోన్‌ ఎక్కడ? దానితోనే ఏ–2 ప్రశాంత్‌తో సంభాషణ!.. అసలు ఆ రోజు ఏం జరిగింది?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top