
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నయవంచక పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్యారంటీల పేరుతో గారడీలు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీష్‌రావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ నేతలు రుణమాఫీపై పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. గ్యారంటీల పేరుతో గారడీలు చేశారు. 11 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ వచ్చింది అన్ని పథకాలు మాయమయ్యాయి. పథకాల పాలన పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే పాలన వచ్చింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.