
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. అసంబ్లీ సెక్రటరీని కలిశారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 22వ తేదీ) మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..పార్టీ ఫిరాయిచిన ఎమ్మెల్యేలపై అదనపు సమాచారమిచ్చారు. అఫిడవిట్ రూపంలో సెక్రటరీకి సమాచారమిచ్చారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.
అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ నియోజక వర్గ ప్రజలకు ద్రోహం చేసి పార్టీ మారారు. వారికి సంబంధించి అన్ని ఆధారాలు సెక్రటరీకి సమర్పించాము. స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం. నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ నిర్ణయిస్తారని కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు.
సోయి జ్ఞానంతో మాట్లాడాలి. స్పీకర్ నిర్ణయం ఏదైనా ప్రజల దృష్టిలో వారెంటో అర్థం అయింది. ఉప ఎన్నికలు రావటం ఖాయం...పార్టీ మారిన ఎమ్మెల్యేలు మట్టి కరవటం ఖాయం. బిఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఫిరాయింపుల చట్టం వచ్చింది. ఫిరాయింపులు ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ. ఫిరాయింపులకు కారణం కాంగ్రెస్, బీజేపీలే’ అని ధ్వజమెత్తారు.