సుప్రీంకోర్టు నోటీసులు.. యూటర్న్‌ తీసుకున్న తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు | U-turn by defecting MLAs in Telangana | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు నోటీసులు.. యూటర్న్‌ తీసుకున్న తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

Sep 11 2025 7:49 PM | Updated on Sep 11 2025 8:10 PM

U-turn by defecting MLAs in Telangana

సాక్షి,హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసన సభ స్పీకర్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు యూ టర్న్‌ తీసుకున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని స్పష్టం చేశారు.

బీఆర్​ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ  స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్‌ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కౌంటర్‌ దాఖలు చేశారు.

  • కాంగ్రెస్‌లో చేరలేదు.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ను కలిశా.బీఆర్‌ఎస్‌కు నేను రాజీనామా చేయలేదు-పోచారం శ్రీనివాస్ రెడ్డి

  • మా ఫోటోలను మార్ఫ్ చేశారు. నేను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.నాది బీఆర్‌ఎస్‌ ఐడియాలజీ- బండ్ల  కృష్ణ మోహన్ రెడ్డి

  • నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.కాంగ్రెస్‌లో చేరానన్నది అబద్ధం- కాలే యాదయ్య

  • నేను బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నా. కాంగ్రెస్‌లో చేరలేదు. ఇప్పటికి బీఆర్‌ఎస్‌కే నా మద్దతు-  గూడెం మహిపాల్‌

  • ఇప్పటికి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశా- అరికెపూడి గాంధీ వివరణిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement