టుడేస్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్‌.. బెంగాల్‌ వారిదే.. తమిళనాడులో..? | bjp will win in west bengal predicts Today Chanakya | Sakshi
Sakshi News home page

టుడేస్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్‌.. బెంగాల్‌ వారిదే.. తమిళనాడులో..?

Apr 30 2026 6:47 PM | Updated on Apr 30 2026 9:19 PM

bjp will win in west bengal predicts Today Chanakya

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ టుడేస్‌ చాణుక్య విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ 192 సీట్లను కైవసం చేసుకుంటుందని, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి ఓటమి ఖాయమని పేర్కొంది.

ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం, బీజేపీకి 48 శాతం ఓటు షేర్‌తో 192 సీట్లు, టీఎంసీకి 38 శాతం ఓటు షేర్‌తో 100 సీట్లు, ఇతరులకు 14 శాతం ఓటు షేర్‌తో 2 సీట్లు లభిస్తాయని అంచనా వేసింది.

అదే సమయంలో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తుందని టుడేస్‌ చాణుక్య అంచనా వేసింది. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 39 శాతం ఓటు షేర్‌తో 125 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. విజయ్‌ పార్టీ 30 శాతం ఓటు షేర్‌తో 63 స్థానాలు సాధిస్తుందని, మరో 10 స్థానాల్లో ఎడ్జ్‌లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే-బీజేపీ అలయన్స్‌ నిరాశ చెందుతుందని, 27 శాతం ఓటు షేర్‌తో 45 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వేలో తేల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement